రేషన్ కార్డు ఉన్నవారికి గొప్ప శుభవార్త.. ఫ్రీ కోచింగ్ తో పాటు ఉద్యోగం గ్యారంటీ!

రేషన్ కార్డు ఉన్నవారికి గొప్ప శుభవార్త.. ఫ్రీ కోచింగ్ తో పాటు ఉద్యోగం గ్యారంటీ!

Good news for ration card holders: రేషన్ కార్డు ఉన్న మహిళలకు గొప్ప శుభవార్త చెప్పింది 'SBI గ్రామీణ స్వయం శిక్షణ సంస్థ'. ఈ సంస్థ అందించే కోర్స్ లకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Good news for ration card holders: రేషన్ కార్డు ఉన్న మహిళలకు గొప్ప శుభవార్త చెప్పింది 'SBI గ్రామీణ స్వయం శిక్షణ సంస్థ'. ఈ సంస్థ అందించే కోర్స్ లకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశంలో నెలకొన్న పేదరికాన్ని రూపుమాపడానికి ప్రభుత్వంతో పాటుగా ఎన్నో ప్రైవేట్ రంగ సంస్థలు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అందులో భాగంగానే నిరుద్యోగ యువతీ, యువకుల కోసం పలు రకాల కోర్స్ లకు ఉచితంగా శిక్షణలు ఇవ్వడమే కాకుండా.. వారికి జాబ్ గ్యారెంటీలను సదరు సంస్థలు ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయం. తాజాగా రేషన్ కార్డు ఉన్న మహిళలకు గొప్ప శుభవార్త చెప్పింది ‘SBI గ్రామీణ స్వయం శిక్షణ సంస్థ’. ఈ సంస్థ అందించే కోర్స్ లకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రేషన్ కార్డు కలిగి ఉన్నారా? మీరు 18 నుంచి 45 లోపు వయసు ఉన్న మహిళలా అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతులకు ‘SBI గ్రామీణ స్వయం శిక్షణ సంస్థ’ ఉచితంగా ఉపాధి శిక్షణ కల్పించడానికి సిద్దమైంది. పైన తెలిపిన అర్హతలు ఉన్న మహిళలకు మగ్గం వర్క్స్, బ్యూటీ పార్లర్, ఉమెన్స్ టైలరింగ్ రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. రేషన్ కార్డు ఉన్న 18 నుంచి 45 సంవత్సరాల మహిళలు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులుగా సంస్థ పేర్కొంది. వీటితో పాటుగా తెలుగు చదవడం, రాయడం తెలిసి ఉండాలి.

రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ ఫొటోలతో పాటుగా బ్యాంక్ పాస్ బుక్ ఇతర విద్యార్హత పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేసి.. ఏప్రిల్ 2 నుంచి శిక్షణ ఇస్తారని సమాచారం. దీనికి ఎంపికైన వారికి ఉచిత వసతితో పాటుగా భోజన సదుపాయం కూడా కల్పించనున్నారు. కోచింగ్ పూర్తైన తర్వాత వారికి ఉపాధి గ్యారెంటీగా దొరుకుతుందని సంస్థకి చెందిన అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన యువతులకు ఈ శిక్షణ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ శిక్షణ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే 9704056522, 9849307873 ఫోన్ నెంబర్లకు కాల్ చేయెుచ్చని సంస్థ తెలియజేసింది.

ఇదికూడా చదవండి: బ్రేకింగ్: మరో నలుగురు MP అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

Show comments