ధరలు పెరిగినా.. బంగారం గీరాకీ తగ్గలే..జనాలు ఏమీ అమాయకులు కాదు

ధరలు పెరిగినా.. బంగారం గీరాకీ తగ్గలే..జనాలు ఏమీ అమాయకులు కాదు

ఈ ఏడాది పసిడి, వెండి ధరల్లో రోజుకొక మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బంగారం ధర పెరిగిన, దాని గిరాకీ మాత్రం తగ్గడం లేదు. ఇక మార్చి నెలలో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా పసిడి గిరాకీ వార్షిక ప్రాతిదిక ఎంత శాతం పెరిగిందో డబ్లూజీసీ తాజాగా పేర్కొంది.

ఈ ఏడాది పసిడి, వెండి ధరల్లో రోజుకొక మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బంగారం ధర పెరిగిన, దాని గిరాకీ మాత్రం తగ్గడం లేదు. ఇక మార్చి నెలలో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా పసిడి గిరాకీ వార్షిక ప్రాతిదిక ఎంత శాతం పెరిగిందో డబ్లూజీసీ తాజాగా పేర్కొంది.

బంగారం అంటే ఇష్టపడని వారంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ముఖ్యంగా మహిళల గురించైతే ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల డిజైన్లతో చేసే బంగారు అభరణాలను ధరించేందుకు ఎంతో ఉత్సాహపడతారు. కానీ,ఈ మధ్యకాలంలో బంగారం ధరలు పసిడి ప్రియులకు భారీగా షాకిస్తున్నాయి. ముఖ్యంగా శుభకార్యాల సీజన్ కావడంతో.. దేశ వ్యాప్తంగా జ్యూలరీ షాపులకు బంగారం కొనుగోళ్లు చేయడానికి క్యూ కడుతున్నారు. అయితే ఒక్క పెళ్లిళ్లు మాత్రమే కాకుండా.. పుట్టిన రోజు వేడుకలు, ఇతర ఫంక్షన్ల నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య ఘణనీయంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే బంగారానికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అంతేకాకుండా.. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల ప్రభావం బంగారంపై పడుతుంది. ఈ క్రమంలోనే తరుచూ మార్కెట్ లో పసిడి, వెండి ధరల్లో మార్పులు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే ధరలు పెరుగుతున్న, బంగారం గిరాకీ తగ్గడం లేదు. ఇదిలా ఉంటే.. గత నెల అనగా మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా పసిడి గిరాకీ వార్షిక ప్రతిపాదికన ఎంత శాతం పెరిగిందో తాజాగా డబ్లూజీసీ పేర్కొంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ ఏడాది పసిడి, వెండి ధరల్లో రోజుకొక మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బంగారం ధర పెరిగిన, దాని గిరాకీ మాత్రం తగ్గడం లేదు. ఇక మార్చి నెలలో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా పసిడి గిరాకీ వార్షిక ప్రాతిదిక ఎంత శాతం పెరిగిందో డబ్లూజీసీ తాజాగా పేర్కొంది. కాగా, పసిడి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి 136.6 టన్నులకు చేరింది. అయితే అందుకు బలమైన ఆర్థిక పరిస్థితులే కారణమని తాజాగా డబ్లూజీసీ వెల్లడించింది. అంతేకాకుండా.. ఆర్ బీఐ పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం కూడా డిమాండ్ పెరగడానికి దోహదం చేసిందని తెలిపారు. ఈ క్రమంలోనే జనవరి, మర్చి త్రైమాసికంలో బంగారం డిమాండ్ విలువ పరంగా గతేడాది పోలిస్తే 20 శాతం పెరిగి రూ. 75,470 కోట్లకు చేరింది. ఇలా మొత్తం పసిడి గిరాకీలో ఆభరణాల వాటా 95.5 టన్నులుకు చేరింది. ఇది వార్షిక ప్రాతిపదికన నాలుగు శాతం పెరిగింది. కాగా, పెట్టుబడుల కోసం కొనుగోలు చేసే బంగారం 19 శాతం పుంజుకొని 41.1 టన్నులకు చేరింది. కాగా, భారత్ లో కొనసాగుతున్న బలమైన స్థూల ఆర్థిక వాతావరణమే బంగారు ఆభరణాల గిరాకీకి దోహదం చేసిందని డబ్లూజీసీ ఇండియా సీఈఓ సచిన్ జైన్ తెలిపారు.

ఇక ఈ ఏడాది బంగారం గిరాకీ 700 నుంచి 800 టన్నులకు చేరొచ్చని జైన్ అంచనా వేశారు. కాగా, 2023లో ఇది 747.5 టన్నులుగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే సాధారణంగా పసిడి ధరలు తగ్గినప్పుడు భారత్,చైనా వంటి మార్కెట్లలో కొనుగోళ్లు పెరుగుతాయని చెప్పారు. అయితే ఆర్ బీఐ బంగారం కొనుగోళ్లను పెంచడం కూడా డిమాండ్ పెరగాడానికి దోహదం చేయడానికి మరో కారణమని జైన్ వెల్లడించారు. కాగా, 2023 మొత్తంలో 16 టన్నులు కొనుగోలు చేసిన కేంద్ర బ్యాంకు.. ఈసారి ఒక్క మార్చి త్రైమాసికంలోనే 19 టన్నులు కొన్నట్లు తెలిపారు. ఇలా చూసుకుంటే.. రాబోయే రోజుల్లోనూ దీన్ని కొనసాగిస్తామని ఆర్ బీఐ సంకేతాలిచ్చినట్లు పేర్కొన్నారు.అయితే విలువపరంగా చూస్తే ఆభరణాల వాటా 15 శాతం పెరిగి రూ.52,750 కోట్లకు చేరింది. పెట్టుబడుల వాటా 32 శాతం పెరిగి రూ.22,720 కోట్లకు ఎగబాకింది. మొత్తంగా కొనుగోళ్ల విలువ మార్చి త్రైమాసికంలో 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది. మరోవైపు భారత్‌లో బంగారం (Gold) పునర్వినియోగం పది శాతం పెరిగి 38.3 టన్నులకు చేరింది. కాగా, మొత్తం 2024 తొలి మూడు నెలల వ్యవధిలో బంగారం దిగుమతులు 25 శాతం పెరిగి 179.4 టన్నులకు చేరాయి. ఈ త్రైమాసికంలో 10 గ్రాముల సగటు ధర రూ.55,247.20గా నమోదైంది. మరి, ధరలు పెరిగిన, బంగారం గీరాకీ తగ్గకపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments