సినీ సెలబ్రిటీలకు మన దేశంలో ఉండే పాపులారిటీ గురించి తెలిసిందే. తమకు నచ్చిన నటులను ప్రేక్షకులు ఎంతగానో ఆరాధిస్తారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వారిపై తమ అభిమానాన్ని, ప్రేమను చూపిస్తుంటారు. ఎంతగానో ఇష్టపడే నటుల సినీ కెరీర్‌తో పాటు వారి వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలను కూడా తెలుసుకోవాలనే కుతూహం ఫ్యాన్స్‌లో ఉండటం సర్వసాధారణమే. అయితే సెలబ్రిటీలు మాత్రం తమ పర్సనల్ లైఫ్‌లోని ప్రతి విషయాన్ని పంచుకోరు. ముఖ్యంగా రిలేషన్షిప్స్ లాంటి సున్నితమైన విషయాలను షేర్ చేసుకోవడానికి అంతగా ఇష్టపడరు.
యాక్టర్స్ పంచుకోకపోయినా ఏదో ఒక విధంగా వారి జీవిత విశేషాలు బయటకు వచ్చేస్తుంటాయి. ఫలానా హీరో, ఫలానా హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నారు లేదా ఫలానా హీరోయిన్, ఫలానా వ్యక్తితో లవ్‌లో పడ్డారు లాంటి గాసిప్స్‌ను మీడియాలో చూస్తూనే ఉంటాం. వీటిలో కొన్ని రూమర్స్‌గానే మిగిలిపోయినా.. మరికొన్ని నిజమైనవి కూడా ఉన్నాయి. తాజాగా కోలీవుడ్ నటి గాయత్రీ శంకర్ గురించి ఇలాంటి గాసిప్ ఒకటి వినిపిస్తోంది. ‘18 వయసు’, ‘నడువుల కొంజం పక్కత కానోమ్’ చిత్రాలతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన గాయత్రి ప్రేమలో పడ్డట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. స్టాండప్ కమెడియన్ అరవింద్‌తో ఆమె డేటింగ్లో ఉన్నట్లు కోలీవుడ్ టాక్.
రీసెంట్గా గాయత్రి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఫొటో చూస్తే ఆమెపై వస్తున్న రూమర్స్ నిజమని అనిపించకమానదు. ఈ ఫొటోలో గాయత్రి, అరవింద్‌ను కౌగిలించుకుంటూ కనిపించారు. అంతేగాకుండా ఆ ఫొటోకు ఈ ముద్దుగుమ్మ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. కమెడియన్‌గా ఆయన ఎదుగుదలను ఆమె ప్రశంసించారు. మీతో మాట్లాడుతున్నందుకు చాలా గర్వపడుతున్నానని గాయత్రి పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంట పక్కా డేటింగ్లో ఉన్నారంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాము లవ్‌లో ఉన్నామంటూ వస్తున్న వార్తలపై ఇటు గాయత్రి నుంచి గానీ అటు అరవింద్ నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు.