వరల్డ్ కప్ టీమ్.. పాండ్యా బదులు అతడిని సెలెక్ట్ చేయాల్సింది: పాక్ మాజీ క్రికెటర్

వరల్డ్ కప్ టీమ్.. పాండ్యా బదులు అతడిని సెలెక్ట్ చేయాల్సింది: పాక్ మాజీ క్రికెటర్

టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ పై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఫామ్ లోనే పాండ్యా బదులుగా అతడిని టీమ్ లోకి తీసుకోవాల్సిందని పేర్కొన్నాడు. కనేరియా సూచించిన ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ పై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఫామ్ లోనే పాండ్యా బదులుగా అతడిని టీమ్ లోకి తీసుకోవాల్సిందని పేర్కొన్నాడు. కనేరియా సూచించిన ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఎప్పుడైతే పొట్టి ప్రపంచ కప్ లో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించిందో.. అప్పటి నుంచి టీమ్ సెలెక్షన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మాజీ దిగ్గజ క్రికెటర్లతో పాటుగా క్రికెట్ ప్రేమికులు సైతం టీమ్ సెలెక్షన్ బాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గిల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, రింకూ సింగ్ లాంటి ప్లేయర్లను ఎందుకు తీసుకోలేదంటూ విమర్శిస్తున్నారు. అయితే వీటిపై చీఫ్ సెలెక్లర్ అజిత్ అగార్కర్ తో పాటుగా కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానాలు కూడా ఇచ్చారు. ఇక తాజాగా టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ పై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియా జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ క్రికెటర్లు. ఫామ్ లో లేని హార్దిక్ పాండ్యాను, మహ్మద్ సిరాజ్ ను ఎందుకు ఎంపిక చేశారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ లిస్ట్ లోకి తాజాగా చేరాడు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. టీమిండియా సెలెక్షన్ పై మాట్లాడుతూ..” ప్రతిభావంతులైన క్రికెటర్లను ఉత్పత్తి చేస్తుందన్న పేరు భారత్ కు ఉంది. అందుకు తగ్గట్లుగానే జైస్వాల్, అంగ్ క్రిష్ రఘువంశీ, శివమ్ దుబే, అభిషేక్ శర్మ, శశాంక్ శర్మ లాంటి ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు.

అయితే.. వరల్డ్ కప్ టీమ్ లోకి హార్దిక్ పాండ్యాను ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్ధం కావడం లేదు. ఈ ఐపీఎల్ లో పాండ్యా దారుణంగా విఫలం అవుతున్నాడు. అతడికి బదులుగా రింకూ సింగ్ ను ఎంపిక చేయాల్సింది. ఎందుకంటే? ఇప్పటికే టీమ్ లో దుబే ఉన్నాడు. దీంతో పాండ్యాకు బదులుగా రింకూని సెలెక్ట్ చేస్తే బాగుండేది” అని డానిష్ కనేరియా చెప్పుకొచ్చాడు. లోయర్ ఆర్డర్ లో భారీ షాట్లతో హిట్టింగ్ చేయగల రింకూ సింగ్ ని పక్కనపెట్టడం అర్దం లేని పని అని కనేరియా సెలెక్టర్లను విమర్శించాడు. మరి పాండ్యా బదులు రింకూని తీసుకోవాలన్న కనేరియా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments