Etela Rajender In Second Place: గజ్వేల్‌, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ వెనకడుగు!

TS Election Results 2023: గజ్వేల్‌, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ వెనకడుగు!

Etela Rajender, Gajwel And Huzurabad-TS Election Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు..

Etela Rajender, Gajwel And Huzurabad-TS Election Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు..

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ సత్తా చాటుతోంది. ఒంటి గంట ప్రాంతానికి కాంగ్రెస్‌ 65 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ 40 స్థానాల లీడ్‌కు మాత్రమే పరిమితం అయింది. ఇక, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. అయితే, రెండు స్థానాల్లో సీనియర్‌ రాజకీయ నాయకుడు, బీజీపీ నేత ఈటల రాజేందర్‌ లేకపోవటం గమనార్హం. ఆయన గజ్వేల్‌, హుజూరాబాద్‌లలో రెండు చోట్లా పోటీ చేస్తూ ఉన్నారు. ఈ రెండు చోట్లా వెనుకబడి పోయారు.

గజ్వేల్‌ రెండవ స్థానానికి, హుజూరాబాద్‌లో మూడవ స్థానంలో ఉన్నారు. గజ్వేల్‌లో 5 రౌండ్లు ముగిసే సమయానికి కేసీఆర్‌ మొదటి స్థానంలో ఉన్నారు. ఈటల రాజేందర్‌ రెండవ స్థానానికి పరిమితం అయ్యారు. ఇద్దరి మధ్యా దాదాపు 7 వేల ఓట్ల తేడా ఉంది. 7 రౌండ్లు ముగిసే సమయానికి హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రెండవ స్థానంలోకి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఓడితల ప్రణవ్‌ ఉన్నారు. ఈటల రాజేందర్‌ మూడవ స్థానానికి పరిమితం అయ్యారు.

Show comments