OTT Movie Suggestion: ఉప్పెన మూవీలోలా ఆ పనికోసం సముద్రంలోకి వెళ్తారు! OTTలో వెరైటీ మూవీ!

OTT Movie Suggestion: ఉప్పెన మూవీలోలా ఆ పనికోసం సముద్రంలోకి వెళ్తారు! OTTలో వెరైటీ మూవీ!

చాలా మంది హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే కాకుండా సర్వైవల్ డ్రామాస్ చూసేందుకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ లో వస్తున్న సర్వైవల్ థ్రిల్లర్స్ ను ఎలాగూ చూసి ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సర్వైవల్ థ్రిల్లర్స్ మాత్రం కాస్త డిఫరెంట్ ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

చాలా మంది హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే కాకుండా సర్వైవల్ డ్రామాస్ చూసేందుకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ లో వస్తున్న సర్వైవల్ థ్రిల్లర్స్ ను ఎలాగూ చూసి ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సర్వైవల్ థ్రిల్లర్స్ మాత్రం కాస్త డిఫరెంట్ ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

సర్వైవల్ థ్రిల్లర్ అనే మాట వింటే ఈ మధ్య అందరికి మంజుమ్మేల్ బాయ్స్ సినిమానే గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం అది కాదు. ఈ మధ్య కాలంలో హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏ కాకుండా సర్వైవల్ థ్రిల్లర్స్ ను కూడా ఇష్టపడే వారికి ఈమూవీ బెస్ట్ ససజ్జెషన్ అని చెప్పి తీరాలి. ఇది తెలుగు సినిమా అయితే కాదు కానీ.. తెలుగులో కూడా ఉంది. పైగా తేలులో వచ్చిన ఉప్పెన మూవీ సినిమా తరహా కంటే కూడా.. ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా పేరు.. అడ్రిఫ్ట్. ఇది కేవలం సర్వైవల్ థ్రిల్లర్ మాత్రమే కాదు. ఓ అందమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. ఈ అందమైన ప్రేమ కథకు ఇందులోని నటి నటులు ప్రాణం పోశారని చెప్పి తీరాలి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. పైగా తెలుగులో కూడా ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. సర్వైవల్ డ్రామా ప్లాట్ కు ప్రేమ కథను కూడా జోడించడడంతో ఈ కథ ఇంకా అద్భుతంగా కొనసాగిందని చెప్పి తీరాలి.. ఓ 24 ఏళ్ళ అమ్మాయి.. నడి సముద్రంలో 41 రోజుల పాటు చిక్కుకుపోతే.. తన పరిస్థితి ఏంటి.. అనేదే కథ.. అసలు కథలో ఏముంది.. ఎందుకు ఈ సినిమాను మిస్ కాకుండా చూడాలి అనే విషయానికొస్తే.

ఈ సినిమా కథేంటంటే.. అసలు ఈ సినిమా స్టార్ట్ అయ్యేది ఒక బోట్ లో సముద్రం మధ్యలో నీళ్లు నిండిపోయిన ఓ బోట్ లో టామీ అనే అమ్మాయి నిద్ర లేస్తుంది. చుట్టూ చూస్తే ఎవరు కనిపించరు. ఎంత పిలిచినా ఎవరు కనిపించరు. అప్పుడే.. అసలు కథ ప్రారంభం అవుతుంది. టామీ ఓ చిన్న గ్రామానికి వచ్చి అక్కడ కుక్ గా పనిచేస్తుంది. ఆ సమయంలో హీరో పరిచయం అవుతాడు. ఆ హీరోకు ఇల్లు లేక తానే సొంతంగా ఒక బోట్ ను ఇల్లులాగా తయారు చేసుకుని.. అందులోనే ఉంటూ ఉంటాడు. క్రమంగా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా కలిసే జీవిస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో వారిద్దరిని ఓ ముసలి జంట కలుస్తారు.

ఓ బోట్ ను కాలిఫోర్నియాలో వదిలేసి వస్తే చాలా డబ్బులు ఇస్తామని వారితో డీల్ మాట్లాడుకుంటారు. అక్కడకు వెళ్లడం టామీకి ఇష్టం లేకపోయినా కూడా.. ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం ఒప్పుకుంటుంది. అనుకున్నట్లుగానే వారిద్దరూ ఆ బోట్ లో ప్రయాణిస్తారు. కానీ సరిగ్గా అదే సమయంలో.. ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. అసలు టామీ బాయ్ ఫ్రెండ్ ఏమైపోయాడు! దాదాపు 41 రోజుల పాటు ఆ సముద్రంలో ఎందుకు గడపాల్సి వస్తుంది! చివరికిఏమౌతుంది ! అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ అసలు మిస్ అవ్వకూడదు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments