ఈ వెబ్ సిరీస్ 2 ఏళ్లుగా OTTలో ఉంది! చాలా మందికి ఇది బాగుంటాదని తెలియదు!

OTT Suggestion: ఈ వెబ్ సిరీస్ 2 ఏళ్లుగా OTTలో ఉంది! చాలా మందికి ఇది బాగుంటాదని తెలియదు!

సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ ఇష్టం లేని వాళ్లకు కూడా ఈ సిరీస్ ని చూస్తే మాత్రం.. ఆటోమాటిక్ గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఈ సిరీస్ ను కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. మరి ఇంతకీ అది ఏ సిరీస్ ఓ చూసేద్దాం.

సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ ఇష్టం లేని వాళ్లకు కూడా ఈ సిరీస్ ని చూస్తే మాత్రం.. ఆటోమాటిక్ గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఈ సిరీస్ ను కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. మరి ఇంతకీ అది ఏ సిరీస్ ఓ చూసేద్దాం.

సస్పెన్స్ ఎలెమెంట్స్ ఈ మధ్య సినిమాలలో కంటే కూడా సిరీస్ లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనితో ప్రేక్షకులు సిరీస్ లు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సిరీస్ లను ఆదరించిన ప్రేక్షకులు.. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను మిస్ చేస్తే మాత్రం.. ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. ఈ సిరీస్ చూస్తే.. సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. పైగా ఇది ఒక తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మరి ఇంతకీ ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ లో అసలు దాగి ఉన్న స్టోరీ ఏంటో చూసేద్దాం.

ఈ తెలుగు వెబ్ సిరీస్ పేరు “గాలి వాన”. ఈ సిరీస్ కు శరణ్ కొప్పి శెట్టి దర్శకత్వం వహించారు. కాగా ఈ సిరీస్ లో రాధికా శరత్ కుమార్, సాయి కుమార్, నందినీ రాయ్, చాందిని చౌదరి, చైతన్యకృష్ణ, ఆశ్రిత వేముగంటి, ‘తాగుబోతు’ రమేష్, శరణ్య అంతా కూడా ముఖ్య పాత్రలు పోషించారు. 2022 లో వచ్చిన ఈ సిరీస్ జీ 5 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబ కథా నేపథ్యంలో సాగే ఓ మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఈ గాలి వాన. ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా ఏడు ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సిరీస్.. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. ముఖ్యంగా మొదట 10 నిమిషాలు ఈ సిరీస్ ను అస్సలు మిస్ కాకూడదు. అసలు ఈ సిరీస్ ను ఎందుకు చూడాలి.. ఈ సిరీస్ కథేంటి అనే విషయానికొస్తే..

ఈ సిరీస్.. లో రాధికా కుమారుడు అజయ్, సాయి కుమార్ కుమార్తె గీత ప్రేమించుకుంటారు. సాయి కుమార్ కు ఇష్టం లేకపోయినా సరే.. వారిద్దరికీ పెళ్లి చేస్తాడు. అయితే కొద్దీ రోజులకు ఆ నవ దంపతులను ఓ యువకుడు హత్య చేస్తాడు. ఆ తర్వాత ఆ హత్య చేసిన వ్యక్తి కార్ లో పారిపోతున్న క్రమంలో ఆ కారు సరిగ్గా రాధికా ఇంటి ముందు ఆగుతుంది. బాగా గాలి వాన కారణంగా ఆ కార్ కు యాక్సిడెంట్ అవుతుంది. దీనితో రాధికా కుటుంబం ఆ వ్యక్తికీ చికిత్స అందిస్తున్న క్రమంలో.. వాళ్ళ కొడుకు కొండలను చంపింది అతనే అని తెలిసిపోతుంది. దీనితో తెల్లవారేసరికి ఆ వ్యక్తి హత్యకు గురవుతాడు. అతన్ని చంపింది ఎవరు ! అసలు అతను ఆ దంపతులను ఎందుకు చంపాడు ! ఆ రెండు కుటుంబాలు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాయి ! చివరకు ఏమైంది ! ఈ రెండు హత్యలకు ఏదైనా సంబంధం ఉందా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. మరి ఈ వెబ్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments