OTT లో ఉన్న ఈ టాప్ 5 యాక్షన్ డ్రామా మూవీ చూడలేదా?

OTT Suggestion: OTT లో ఉన్న ఈ టాప్ 5 యాక్షన్ డ్రామా మూవీ చూడలేదా?

ఓటీటీ లో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. మరి వాటిలో కొన్ని కేవలం యాక్షన్ డ్రామాస్ ను మాత్రమే చూసే ప్రేక్షకులకు దానికి సంబంధించిన బెస్ట్ మూవీస్ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్నాయో చూసేద్దాం.

ఓటీటీ లో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. మరి వాటిలో కొన్ని కేవలం యాక్షన్ డ్రామాస్ ను మాత్రమే చూసే ప్రేక్షకులకు దానికి సంబంధించిన బెస్ట్ మూవీస్ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్నాయో చూసేద్దాం.

మూవీ లవర్స్ అంతా అన్ని సినిమాలను చూసినా కూడా.. వాటిలో వారికి కొన్ని ఫేవరేట్ జోనర్స్ ఉంటాయి. కొంతమంది హర్రర్ సినిమాలను మాత్రమే ఇష్టపడితే, మరి కొంతమంది కామెడీ సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో జోనర్ అంటే ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో యాక్షన్ డ్రామాస్ ను మాత్రమే ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఉంటూ ఉంటారు. ఇప్పటివరకు యాక్షన్ డ్రామా కంటెంట్ లో చాలా సినిమాలు వచ్చినా కానీ.. ఈ సినిమాలను మిస్ చేస్తే మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ను మిస్ అయినట్లే. మరి యాక్షన్ డ్రామాస్ లో ఏ ఏ సినిమాలు చూస్తే బెస్ట్ ఎంటటైన్మెంట్ దొరుకుతుంది. ఆ సినిమాలు ఏ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్నాయి.. అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు చెప్పుకోబోయేది టాప్ 5 బెస్ట్ కొరియన్ డ్రామాస్.. ఏ మధ్య కాలంలో కొరియన్ సిరీస్ లను చూసే ప్రేక్షకులు చాలా మంది పెరిగిపోతున్నారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ను బట్టి ఆయా సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు . ఇప్పుడు చెప్పుకోబోయే కొరియన్ సిరీస్ కూడా ఇలాంటివే. ఈ ఇంటెన్స్ కొరియన్ సిరీస్ చూస్తూ ఉంటే బ్రేక్ కూడా తీసుకోవాలని అనిపించదు. మరి ఆ కొరియన్ డ్రామాస్ ఏంటో చూసేద్దాం.

సిటీ హంటర్:

ఈ మూవీ ఓ ప్రైవేట్ డిటెక్టివ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇతను ఓ దగ్గర స్వీపర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే, అక్కడ వారు చేసే అనధికార వ్యాపారాన్ని సిటీ హంటర్ అని అంటూ ఉంటారు. వీరి సహాయం కావాల్సిన వారు.. ఓ స్టేషన్ లో బ్లాక్ బోర్డు పైన “XYZ” అని రాసి వారిని సంప్రదించాలి. ఆ తర్వాత వారు ఎలా అందరికి సహాయం చేశారనేదే ఈ స్టోరీ. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

హీలర్:

ఈ సిరీస్ లో ఓ ముగ్గురు వ్యక్తులు ఓ ఈవెంట్ ద్వారా కలుసుకుంటారు. వారిలో ఓ వ్యక్తి ఇల్లీగల్ నైట్ కొరియర్, ఇంకొకరు రిపోర్టర్, మరొకరు జర్నలిస్ట్. ఈ జర్నలిస్ట్ ఓ రోజు గతంలో జరిగిన ఓ కేసు గురించి నిజం తెలుసుకుని.. ఆ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉద్దేశ పూర్వకంగా సంప్రదించి సహాయం చేస్తుంటాడు. అసలు అతను ఎందుకు అలా చేస్తుంటాడు, ఈ ముగ్గురు వ్యక్తులకు గల సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

కింగ్‌డమ్:

ఈ సిరీస్ 1392 నుంచి 1910 మధ్య కాలంలో జరిగిన రాజవంశం కథ. ఈ సిరీస్ లో ఓ సామ్రాజ్యానికి చెందిన రాజు మసూచి వ్యాధి బారిన పడతాడు. ఈలోపే ఆటను మరణించాడనే పుకార్లు పుట్టుకొస్తాయి. ఈలోగా మరొక సామ్రాజ్యపు యువరాజు ఈ సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎం జరిగింది.. ఈ కథ ఎక్కడివరకు కొనసాగిందో తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

బ్లడ్‌హౌండ్స్:

ఈ కథలో హీరో ఓ గొప్ప బాక్సర్. అతను తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు, ఆమె ఓ కేఫ్ ను రన్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ యువకుడు అనుకోకుండా తన ప్రత్యర్థితోనే కలిసి స్నేహం చేయాల్సి వస్తుంది. క్రమంగా వారిద్దరి మధ్య స్నేహం కూడా ఏర్పడుతుంది. వీరిద్దరూ కలిసి తమ ఊరిలో ఉన్న ఓ వడ్డీ వ్యాపారి అవినీతిని బయటపెట్టాలని చూస్తుంటారు. ఈ క్రమంలో వారికి ఎదురైన సంఘటనలు ఏంటి అనేది ఈ సినిమా కథ.. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

విజిలెంటే:

ఈ సినిమా ఓ విజిలెంటే అనే ఓ సంస్థను ట్రాక్ చేసే.. మెట్రోపాలిటన్ ఇన్వెస్టిగేషన్ టీం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని శిక్షిస్తూ ఉంటుంది. ఇది సమాజంలో ఓ పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఆ తర్వాత ఈ కథ ఎక్కడి వరకు సాగిందో తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments