OTT లో ఉన్న 5 బెస్ట్ కొరియన్ డ్రామాస్! ఒకదాన్ని మించి ఇంకోటి ఉంటుంది!

OTT Suggestion: OTT లో ఉన్న 5 బెస్ట్ కొరియన్ డ్రామాస్! ఒకదాన్ని మించి ఇంకోటి ఉంటుంది!

ఇప్పుడు ఏ భాషలో ఆయా సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వస్తున్నాయనేకంటే.. ఏ జోనర్ కు సంబంధించిన సినిమాలు వస్తున్నాయా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. వారిలో ఇప్పుడు కే డ్రామా లవర్స్ బాగా పెరిగిపోయారు. మరి ఓటీటీ లో ఉన్న బెస్ట్ కే డ్రామాస్ ఏవో చూసేద్దాం.

ఇప్పుడు ఏ భాషలో ఆయా సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వస్తున్నాయనేకంటే.. ఏ జోనర్ కు సంబంధించిన సినిమాలు వస్తున్నాయా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. వారిలో ఇప్పుడు కే డ్రామా లవర్స్ బాగా పెరిగిపోయారు. మరి ఓటీటీ లో ఉన్న బెస్ట్ కే డ్రామాస్ ఏవో చూసేద్దాం.

ఇప్పుడు కొరియన్ సిరీస్ , సినిమాలను ఇష్టపడని వారు ఎవరు లేరు. ఓటీటీలలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు ఒక ఎత్తైతే.. కొరియన్ సినిమాలు ఒక ఎత్తని చెప్పి తీరాలి. ఈ కొరియన్ సిరీస్ లు సినిమాలు ఎప్పుడు వచ్చాయో తెలియదు కానీ.. తెలుగు యూత్ ని బాగా అఆకట్టుకున్నాయి. ఇప్ప్పుడు మాత్రం కొరియన్ సిరీస్ కు పెరుగుతున్న క్రేజ్ అంత ఇంత కాదు. ముఖ్యంగా అమ్మాయిలు కొరియన్ సిరీస్ అంటే ప్రాణం పెట్టేస్తున్నారు. అంతలా యూత్ ను అట్ట్రాక్ట్ చేస్తున్నాయి ఈ కొరియన్ సిరీస్. దీనితో అసలు వాటిలో ఏముందా ఎలా ఉంటాయా అని తెలుసుకోవాలనే ఆసక్తి కొంతమందికి కలుగుతుంది. కొరియన్ సిరీస్ అంటే ఇంట్రెస్ట్ లేని వారికి కూడా ఈ కే డ్రామాస్ ను చూస్తే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. మరి ఓటీటీ లో అందుబాటులో ఉన్న ఈ కే డ్రామాస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

వివిధ రకాల ప్లాట్ ఫార్మ్స్ లో అంబాటులో ఉన్న బెస్ట్ కొరియన్ డ్రామాస్ ఇవే. పైగా వీటిలో కొన్ని తెలుగులో కూడా ఉండడం విశేషం.

1. కిల్ మీ హీల్ మి :
జి సంగ్, హ్వాంగ్ జంగ్-ఇయుమ్, పార్క్ సియో-జూన్, ఓహ్ మిన్-సుక్ , కిమ్ యో-రి వంటి వారు నటించిన పాపులర్ సిరీస్ ఇది. కే డ్రామాస్ చూసే వారికి ఈ పేర్లు బాగా తెలుస్తాయి. ఈ సిరీస్ జియో సినిమాలో అందుబాటులో ఉంది. 2015 లో ఈ సిరీస్ ను విడుదల చేశారు మేకర్స్. ఆ సమయంలో ఈ సిరీస్ కు ప్రత్యేక ఆదరణ లభించింది.

2. కైరోస్:
ఈ సిరీస్ మొత్తం 32 ఎపిసోడ్స్ ఉంటుంది. ఈ సిరీస్ కు పార్క్ సెంగ్-వూ దర్శకత్వం వహించారు. ఎమోషనల్ టచ్ తో ఈ సిరీస్ ను తెరకెక్కించారు మేకర్స్. 2020 నుంచి కథనంతో ఈ సిరీస్ ను రూపొందించారు. 2020 లో ఈ సిరీస్ ను విడుదల చేశారు. జియో సినిమాలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

3. ఐ యామ్ నాట్ రోబోట్ :
ఇది ఒక రొమాంటిక్ సిరీస్. ఈ సిరీస్ జియో సినిమాతో పాటు ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. అన్నీ ఉన్నా మనుషులకు దూరంగా ఉండే ఓ యువకుడు. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోడానికి ఒక రోబో తో సమయం గడుపుతాడు. కానీ, ఆమె నిజంగా మనిషే అన్న సంగతి మాత్రం అతనికి తెలియదు.

4. లియో:
పెద్ద పెద్ద డైనోసార్‌లు ఎన్నో విధ్వంసాలు సృష్టించడం ఎన్నో సినిమాలలో చూస్తూనే ఉన్నాము. కానీ ఓ బల్లి విధ్వంసం సృష్టించడం ఎప్పుడైనా చూశారా. అలాంటి ఓ సిరీస్ ఏ ఈ లియో. ఈ సిరీస్ ను తెలుగులో కూడా చూసేయొచ్చు. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు ఈ సినిమాలో కామెడీ ఎలెమెంట్స్ కూడా ఉంటాయి.

5. బ్లడ్ ఫ్రీ :
ఈ సిరీస్ ప్రతి బుధవారం.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతోంది. ఈ సిరీస్ కొంచెం డిఫ్ఫరెంట్.. భవిష్యత్తులో మనుషులు మాంసాన్ని ఎలా తింటారు అనే ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ను రూపొందించారు. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకులు తెలుసుకోవచ్చు.

మరి ఈ కే డ్రామా సిరీస్ ల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Show comments