Second Heart: మనిషిలో రెండో గుండె ఉందని మీకు తెలుసా? ఎక్కడుంటుందంటే?

మనిషిలో రెండో గుండె ఉందని మీకు తెలుసా? ఎక్కడుంటుందంటే?

ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన అమ్మాయితో చెప్పే మాట.. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా.. నా గుండెల్లో నీ కోసం గుడి కడతా.. అందులో నిన్ను పెడతా అని ఇలా డవిలాగులు చెబుతూ ఉంటారు. అయితే మీకెప్పుడైనా అనిపించిందా? గుండెలు అంటున్నారు ఏంటి వీళ్ళు అని. అసలు మనిషికి రెండు గుండెలు ఉంటాయా? ఉంటే ఇంకో గుండె ఎక్కడుంటుంది?

ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన అమ్మాయితో చెప్పే మాట.. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా.. నా గుండెల్లో నీ కోసం గుడి కడతా.. అందులో నిన్ను పెడతా అని ఇలా డవిలాగులు చెబుతూ ఉంటారు. అయితే మీకెప్పుడైనా అనిపించిందా? గుండెలు అంటున్నారు ఏంటి వీళ్ళు అని. అసలు మనిషికి రెండు గుండెలు ఉంటాయా? ఉంటే ఇంకో గుండె ఎక్కడుంటుంది?

ఎన్ని గుండెలురా అని పాత సినిమాల్లో విలన్ ని ఉద్దేశించి హీరో అనడం మనం చూశాం. మనిషికి ఉండేది ఒకటే గుండె కదా.. వీళ్లేంటి ఎన్ని గుండెలు అంటున్నారు అని మీకెప్పుడైనా అనిపించిందా? అలానే ప్రియురాలిని ఉద్దేశించి ప్రియుడు.. నువ్వు నా గుండెల్లో ఉన్నావ్ అని అంటాడు. ఒకటే గుండె కదా.. మరి గుండెల్లో అంటాడేమిటి? అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే వీళ్ళు ఊరికే అనలేదు. నిజంగానే మనిషికి రెండు గుండెలు ఉన్నాయంట. అయితే ఆ గుండె ఎక్కడుందో తెలిస్తే.. మీ గుండె లటుక్కున కొంచెం కిందకి జారిపోవచ్చు. మానవ శరీరంలో సోలియస్ అనే కండరం ఉంటుందట. దీన్ని రెండో గుండె అని అంటారట.

ఇది పిక్కల్లో ఉంటుంది. శక్తివంతమైన కండరం ఇది. నిలబడడానికి, నడవడానికి ఈ కండరం సహాయపడుతుంది. అంతేకాకుండా.. దీని వల్ల ఇంకో ప్రాముఖ్యత కూడా ఉంది. దీని లోపల రెండు ముఖ్యమైన సిరలు ఉంటాయి. ఇవి రక్తాన్ని సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే దీన్ని రెండో గుండెకాయ అని అన్నారు. బార్సిలోనా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్.. డాక్టర్ కార్లెస్ పెడ్రేట్ ఈ విషయాన్ని వెల్లడించారు. సోలియస్ అనేది శరీరంలో చాలా పెద్ద కండరం అని.. శరీరమంతటికీ రక్తం సరఫరా చేసేందుకు గుండెకు ఎంతగానో సహాయం చేస్తుందని అన్నారు. పిక్కల లోపల ఉండే ఈ సోలియస్ కండరంలో పెద్ద పెద్ద సిరలు ఉంటాయి. ఈ సిరల్లో ఉండే స్వభావం వల్ల కండరాలు సంకోచిస్తాయి. అప్పుడు ఆ సిరలు కంప్రెస్ అవుతాయి.

ఇలా జరిగినప్పుడు రక్తం సిరల్లో ఫిల్ అవ్వడం, ఖాళీ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రక్తాన్ని తిరిగి గుండెకు సరఫరా చేస్తాయి. నిజానికి మనం వేసి ప్రతి అడుగు వల్ల కాళ్లలో ఉండే రక్తం తిరిగి గుండెకు చేరుతుంది. పాదాల్లో గ్యాస్ట్రోక్నెమియస్ కండరాలు ఉంటాయి. దీన్ని పోప్లిటియల్ పంప్ అంటారు. అయితే శరీరంలో ఉండే ఇతర కండరాల్లానే సోలియస్ కండరాన్ని కూడా హెల్దీగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫాస్ట్ ఫైబర్ కండరాల్లా కాకుండా సోలియస్ కండరం నిదానంగా, స్థిరంగా పని చేస్తుంది. ఈ కండరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ పని చెప్పాలి. మిగతా కండరాలతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి నిరంతర పనితీరు కావాలని.. అలా అని ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదని డాక్టర్ ఫెడ్రేట్ సూచిస్తున్నారు. మరి ఈసారి ఎవరైనా ఎన్ని గుండెలురా నీకు అని అంటే.. రెండని చెప్పండి.

Show comments