Actress Childhood Pic: ఫోటోలో పాపను గుర్తుపట్టారా? పాన్ వరల్డ్ డెబ్యూకి రెడీ అవుతోంది!

ఫోటోలో పాపను గుర్తుపట్టారా? పాన్ వరల్డ్ డెబ్యూకి రెడీ అవుతోంది!

  • Author ajaykrishna Published - 06:56 PM, Wed - 5 July 23
  • Author ajaykrishna Published - 06:56 PM, Wed - 5 July 23
ఫోటోలో పాపను గుర్తుపట్టారా? పాన్ వరల్డ్ డెబ్యూకి రెడీ అవుతోంది!

సినీ సెలబ్రిటీలకు సంబంధించి మూవీ అప్డేట్స్ ఒక్కటే కాదు. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. ఒక్కోసారి సెలబ్రిటీల చిన్ననాటి గుర్తులు కూడా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటాయి. స్టార్స్ అయినా.. ఫామ్ లో లేనివారైనా మనకు ఏదొక ఇంటరెస్టింగ్ విషయం కావాలి. సో.. ఇప్పుడు మనం మాట్లాడుకునే సెలబ్రిటీ పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి బాగా పరిచయం ఉంది. మీరు పైన చూస్తున్న వయ్యారి ఎవరో ఓసారి బాగా గమనించి గుర్తు పట్టండి. తనకు పాన్ ఇండియా క్రేజ్ మాత్రమే కాదు.. ఫ్యాన్ బేస్ కూడా దేశాలు దాటిపోయింది. రెడ్ కార్పెట్ పై కూడా నడిచిన ఘనత ఉంది.

ఇంకా గుర్తు రాలేదా.. మీకో క్లూ ఇస్తా. ఆ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్. పైగా తెలుగులో ఇంతవరకు ఒక్క సినిమా చేయకపోయినా.. అభిమానులు మాత్రం భీభత్సంగా ఉన్నారు. చీరకట్టు నుండి టు పీస్ బికినీ వరకు.. క్యారెక్టర్ కి ఏది కావాలంటే అది అసలు మొహమాటం లేకుండా చేసేస్తుంది. డ్రెస్సింగ్ స్టైల్ లోనే కాదు.. సన్నివేశాలలో కూడా అంతే డేర్. ఎమోషనల్ సీన్స్ నుండి కిస్, బెడ్ సీన్స్ వరకు అమ్మడు చాలా పేరొందింది. అయినా తనను బి గ్రేడ్ కోవకు చెందకుండా జాగ్రత్త పడింది. ఇప్పటికి స్టార్ గా వెలుగుతోంది.

ఇప్పుడు కూడా గుర్తు రాలేదంటే.. చివరిగా పెద్ద క్లూ. ఈమె త్వరలో తెలుగులో డెబ్యూ చేయబోతుంది. అదికూడా పాన్ వరల్డ్ మూవీతో. ఇప్పుడైనా అర్థమైందా.? ఆమె ఎవరో కాదు.. దీపికా పదుకొనే. ఈ ఏడాది ఆరంభంలోనే పఠాన్ లాంటి వెయ్యి కోట్ల సినిమా ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే చేస్తూ.. తెలుగు డెబ్యూకి రెడీ అవుతోంది. అయితే.. దీపికా గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు పన్నెండేళ్లకు పైగా బాలీవుడ్ లో స్టార్డమ్ చూస్తోంది. ఇదిలా ఉండగా.. పాప ఎవరో తెలుసా అంటూ.. దీపికాకి సంబంధించి చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. మరి దీపికా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Show comments