ఇండస్ట్రీలో వరుస విషాదాలు... 100 చిత్రాల దర్శకుడు మృతి

ఇండస్ట్రీలో వరుస విషాదాలు… 100 చిత్రాల దర్శకుడు మృతి

ఇండస్ట్రీలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు మృతి చెందాడు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ఇక లేరు.

ఇండస్ట్రీలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు మృతి చెందాడు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ఇక లేరు.

సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఈ నాలుగు నెలల వ్యవధిలో కాలంలో ప్రముఖ నటీనటులు, సింగర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్లను కోల్పోయింది ఇండియన్ ఇండస్ట్రీ. కమెడియన్స్ విశ్వేశ్వరరావు, లొల్లు సభ శేషు, డబ్బింగ్ రైటర్ శ్రీ రామకృష్ణ, పాపులర్ విలన్ డేనియల్ బాలాజీ, ప్రముఖ సింగర్ ఉమా రామనన్, ప్రముఖ హీరోయిన్ అమృత పాండే, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, నటి కనకలత, దర్శకులు హరి కుమార్, బాలీవుడ్-మాలీవుడ్ సీనియర్ దర్శకుడు సంగీత శివన్ తుది శ్వాస విడిచారు. వీరే కాకుండా హాలీవుడ్ చిత్రాలతో సుపరిచితమైన నటులు కూడా మరణించిన సంగతి విదితమే. తాజాగా మరో దర్శక ధీరుడు ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రముఖ దర్శకుడు ఓం శక్తి జగదీశన్ కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. వయసు రీత్యా వచ్చిన సమస్యలతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. తమిళంలో ‘మేల్‌మరువత్తూర్ ఆదిపరాశక్తి’, ‘సమయపురతలే సాక్షి’, ‘మేల్‌మరువత్తూర్‌ అర్బుతంగళ్’, ‘బదుల్‌ సోల్వల్‌ భద్రకాళి’, ‘కై కొడుప్పాళ్ కర్పకాంబళ్’ వంటి భక్తిరస చిత్రాలతో పాటు ‘ఒరే తాయ్ ఒరే కులం’, ‘ఇవర్గల్ ఇండియర్ గళ్, దిశైమారియా పవగైళ్’ వంటి సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు మాజీ ముఖ్యంత్రి, దివంగత నేత ఎంజీఆర్ హీరోగా ఇదయకని చిత్రాలకి జగదీశన్ డైలాగ్స్ అందించాడు.

ప్రముఖ కోలీవుడ్ నటుడు శివాజీ గణేశన్ నటించిన ‘చిరంజీవి’ చిత్రానికి రచన సహకారం అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. మహాన్ రామానుజర్ అనే టీవీ సీరియల్‌ దర్శకత్వం వహించాడు. జగదీశన్ తమిళం, తెలుగు, కన్నడ భాషాల్లో 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇక ఆయన అంత్యక్రియలు బోరూరు శ్మశాన వాటికలో ముగిశాయి. ఆయనకు గురుమూర్తి మరియు రామచంద్రన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురి అయ్యింది. పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Show comments