పరుగులు పెడుతున్న గోల్డ్ ధరలకు బ్రేక్.. ఒక్కసారిగా ఎంత తగ్గిందో!

Gold Rates: పరుగులు పెడుతున్న గోల్డ్ ధరలకు బ్రేక్.. ఒక్కసారిగా ఎంత తగ్గిందో!

కొద్దీ రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. దీనితో పసిడి ప్రియులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

కొద్దీ రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. దీనితో పసిడి ప్రియులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

బంగారం అంటే అందరికి ఇష్టమే. కాస్త కూస్తో బంగారం కొని ఉంచితే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో బంగారం రేట్లు ఎప్పుడు తగ్గుతాయా ఎప్పుడు కొందామా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ, గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. దీనితో బంగారం కొనాలని అనుకునే వారికి నిరాశలే మిగులుతున్నాయి. ఈ క్రమంలో పసిడి ప్రియులకు శుభవార్త అందించేలా.. దూసుకుపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. దీనితో ప్రజలకు కాస్త ఊరట కలిగిందని చెప్ప వచ్చు. మరి ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కానీ కొనేవాళ్ళు కొంటునే ఉన్నారు. కొంతమంది మాత్రం ఎప్పుడు బంగారం ధరలు తగ్గుతాయా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అటువంటి వారందరికీ ఓ గుడ్ న్యూస్. ఇన్ని రోజుల నుంచి ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గిపోయాయి. ఒక్కరోజే భారీగా బంగారం ధరలలో తగ్గుదల కనిపించడంతో.. కొనుగోలు దారుల్లో జోరు మొదలైంది. గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో.. అందరు అడుగులు బంగారం షాపుల దిశగా పడుతున్నాయి. ఒక్కరోజే ఏకంగా 1000 రూపాయలు తగ్గింది. ఏప్రిల్ 30 వ తేదీన 22 క్యారెట్ గోల్డ్ ధర 66 వేల 550 రూపాయలు ఉండగా.. మే 1 న 65 వేల 550 రూపాయలకు తగ్గింది. దీనితో బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే ,మంచి సమయం అని అంతా భావిస్తున్నారు.

స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారెట్స్ బంగారం అని అంటూ ఉంటారు. కానీ దానితో ఎటువంటి ఆభరణాలు తయారు చేయలేరు. అదే 22 క్యారెట్ గోల్డ్ తో అయితే ఆభరణాలు తయారు చేసేందుకు వీలు ఉంటుంది. ఇందులో రాగి, జింక్ లాంటి ఇతర లోహాలు కూడా కలుస్తాయి. కాబట్టి దీనితో అన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేసుకోవచ్చు. దానినే 916 గోల్డ్ అంటూ ఉంటారు. ఇందులో 91.67% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మరి రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి.. బంగారం కొనుగోలు చేసేవారు ఇప్పటినుంచే.. పెట్టుబడి పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments