వీడియో: CSK vs PBKS మ్యాచ్‌లో ఎవరూ గుర్తించని ఘటన! చూస్తే నవ్వు ఆపుకోలేరు

వీడియో: CSK vs PBKS మ్యాచ్‌లో ఎవరూ గుర్తించని ఘటన! చూస్తే నవ్వు ఆపుకోలేరు

Daryl Mitchell, Ashutosh Sharma, CSK vs PBKS: వినోదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిన ఐపీఎల్‌లో క్రికెట్‌ మజాతో పాటు పలు ఫన్నీ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అలాంటి ఘటనే ఇది కూడా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Daryl Mitchell, Ashutosh Sharma, CSK vs PBKS: వినోదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిన ఐపీఎల్‌లో క్రికెట్‌ మజాతో పాటు పలు ఫన్నీ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అలాంటి ఘటనే ఇది కూడా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఐపీఎల్‌లో ఫోర్లు, సిక్సుల వర్షం, అద్భుతమైన బ్యాటింగ్‌, కళ్లు చెదిరే ఫీల్డింగ్‌, వణికించే బౌలింగ్‌ విన్యాసాలతో పాటు.. ఫన్నీ ఫన్నీ సంఘటనలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స​్‌.. చెన్నైని ఓడించింది. ఇప్పుడు పంజాబ్‌ను చెన్నై ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. బౌలర్ల ఆధిపత్యం కొనసాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్ల ముందు పంజాబ్‌ బ్యాటర్లు తలొంచారు. అయితే.. ఒక వైపు పంజాబ్‌ వికెట్లు టపటపా పడుతుంటే.. మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్లు ఫన్నీ డ్యాన్సులతో అలరించారు.

సీఎస్‌కే బౌలర్‌ రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో తొలి బంతికే పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ సామ్‌ కరన్‌ క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మూడో బంతికి అశుతోష్‌ శర్మ కూడా క్యాచ్‌ అవుట్‌గా పెవిలియన్‌ చేరాడు. అయితే.. అశుతోష్‌ శర్మ క్యాచ్‌ను సిమర్‌జిత్‌ సింగ్‌ అందుకున్నాడు. పక్కనే ఉన్న డారిల్ మిచెల్‌ పంజాబ్‌ డ్యాన్స్‌ వేశాడు. మిచెల్‌ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సహజంగా డారిల్ మిచెల్‌ ఇంత సరదాగా ఎప్పుడూ కనిపించలేదు. కానీ, బాగా టైట్‌ అవుతుంది అనుకున్న మ్యాచ్‌లో ఈజీ విక్టరీ రావడంతో ఎప్పుడూ గంభీరంగా ఉండే మిచెల్‌ కూడా కోహ్లీలా సరదాగా మారిపోయాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ 32, డారిల్‌ మిచెల్‌ 30, రవీంద్ర జడేజా 43 పరుగులు చేసి రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ 3, హర్షల్‌ పటేల్‌ 3, అర్షదీప్‌ సింగ్‌ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇక 168 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేసి 28 రన్స్‌ తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ప్రభుసిమ్రాన్‌ సింగ్‌ 30, శశాంక్‌ సింగ్‌ 27 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో జడేజా 3, తుషారా దేశ్‌ పాండే 2, సిమర్‌జిత్‌ 2 వికెట్లుతో అదరగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు డారిల్‌ మిచెల్‌ వేసిన డ్యాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments