OTTలోకి సుంద‌రం మాస్ట‌ర్ మూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTTలోకి సుంద‌రం మాస్ట‌ర్ మూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Sundaram Master OTT: టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా నటించిన తాజా చిత్రం సుందరం మాస్టర్. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది. అది ఎక్కడంటే..

Sundaram Master OTT: టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా నటించిన తాజా చిత్రం సుందరం మాస్టర్. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది. అది ఎక్కడంటే..

టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాజా చిత్రం సుందరం మాస్టర్. ఈ మూవీని దర్శకుడు క‌ళ్యాణ్ సంతోష్ తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్ గా దివ్య శ్రీపాద నటించింది. అలాగే స్టార్ హీరో రవితేజ నిర్మించిన ఈ సినిమా.. గతనెల ఫ్రిబవరి 23న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలయింది. ఇక ఈ మూవీ విడుదలకు ముందు ప్రమోషన్లలో చిరంజీవి, నాగచైతన్యతో పాటు పలువురు అగ్ర హీరోలు పాల్గొనడం.. దీనితో పాటు మూవీ టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మూవీ పై మంచి బజ్ ఏర్పాడింది. దీంతో అతి తక్కువ బడ్జెట్ తో ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించిన సుందరం మాస్టర్ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్స్ రాబెట్టింది. ఈ క్రమంలోనే నిర్మాతలకు మంచి లాభాలు వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన హర్ష సుందరం మాస్టర్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందనని సినీ ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా సుందరం మాస్టర్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. కానీ, విశేషం ఎమిటంటే.. ఏకంగా రెండు ఓటీటీల్లోనూ వైవా హర్ష సినిమా అందుబాటులోకి రానుంది. ఇంతకి ఎక్కడంటే..

కమెడియన్ వైవా హర్ష సుందరం మాస్టర్ గా వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎప్పటిలాగే హర్ష తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇక థియేటర్లలో నవ్వులు పుయించిన హర్ష సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షుకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇది ఏకంగా రెండు ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది. దీనిని ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆహాతో పాటు ఈటీవీ విన్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కు హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. కానీ, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై మాత్రం ఇంక అధికారిక డేట్ ను ప్రకటించాలేదు. బహుశ ఈ సినిమా ఈనెల అనగా మార్చి 21,22 తేదీలలో ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని టాక్ నడుస్తోంది. మరి, ఈ లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ ఆయా ప్లాట్ ఫామ్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ కు రానుందో త్వరలోనే సమాచారం తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై రవితేజ నిర్మించగా..  శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని అందిచారు.

ఇక సుందరం మాస్టర్ కథ విషయానికి వస్తే.. అడవి మధ్యలో ఉన్న మిర్యాల మెట్ట అనే ఊరివాళ్లు తమకు ఇంగ్లిష్ టీచర్ కావాలని స్థానికి ఎమ్మెల్యేను అభ్యర్థిస్తారు. దీంతో ఆ ఊరికి సుందరం మాస్టర్‌ను టీచర్‌గా పంపిస్తాడు ఎమ్మెల్యే. అయితే ఊరిలోని వారందరూ గడగడ ఇంగ్లిష్‌ మాట్లాడుతూ సుందరం మాస్టారుకే ఎదురు పరీక్ష పెడతారు. ఇందులో ఫెయిలయితే ఉరి తీసి చంపేస్తామని సుందరం మాస్టారును బెదిరిస్తారు. మరి ఆ టెస్ట్‌లో సుందరం మాస్టర్ పాసయ్యాడా? అసలు ఎమ్మెల్యే సుందరం మాస్టారను ఎందుకు ఆ పల్లెటూరుకు పంపాడు? ఆ ఊరిలో ఉన్న ఓ విలువైన వస్తువు ఆచూకీ సుందరం మాస్టర్ కనిపెట్టాడా? లేదా? అన్నదే తెలుసుకోవాలంటే సుందరం మాస్టర్ చూడాల్సిందే. మరి త్వరలో సుందరం మాస్టర్ సినిమా ఓటీటీలోకి రాబోతుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments