YS Jagan: జగన్ సరికొత్త చరిత్ర.. 21,840 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ!

జగన్ సరికొత్త చరిత్ర.. 21,840 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ!

YS Jagan: 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంల కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని రీతిలో జగన్ సర్కార్ నిధులను వెచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది.

YS Jagan: 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంల కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని రీతిలో జగన్ సర్కార్ నిధులను వెచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పేదల సొంతిటి కలను నెరవేరుస్తూ..31.19 లక్షల ఇళ్ల పట్టాలను సీఎం జగన్ అందించారు. తాజాగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్  మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి  పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పించింది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద  ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంత పాటు కన్వేయన్స్ డీడ్స్ అందించింది. సీఎం జగన్ చేతుల మీదుగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు.

శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించారు. ఇక్కడ ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఒంగోలు సాక్షిగా ఏపీ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఒంగోలులోని ఎన్. అగ్రహారంలో పేదలకు ఇళ్ల  పట్టాల అందజేత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఒంగోలు తాగు నీటి ప్రాజెక్టు నిర్మాణానికి సైతం సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ బహిరంగ సభ నుంచి ప్రజలను ఉద్దేశిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ.. “దేశ చరిత్రలోనే ఇది ఓ చారిత్రాత్మక ఘట్టం. ఇప్పటికే ఎంతో మందికి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపీణీ చేశాం. ఇప్పుడు ఒంగోలులో 20 వేలమంది అక్కచెల్లమ్మకు నేడు అందిస్తున్నాం. మన ప్రభుత్వం మహిళలకు, పేదల అభివృద్ధి కోసం కృష్టి చేస్తుంది. మన ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. ఆర్థిక అంతరాలను తొలగించాం. అక్కచెల్లెమ్మల కోసం అనేక సంక్షేమా, అభివృద్ధి పథకాలు తెచ్చాము. మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. డీబీడీ ద్వారా ఏకంగా 2.55 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు అందించాము. అలానే ఈ డబ్బులు 75 శాతం ఈ పేద వర్గాలకు అందించగలిగాము.

అదే విధంగా నామినేటేడ్ పోస్టుల విషయంలోనూ మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పెద్ద పీట వేసింది. గతంలో ఎప్పుడు జరగని విధంగా, నామినేటేడ్ పదవులను నా పేద వర్గాల వారికి ఇచ్చాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 75 శాతం లబ్ధి చేకూర్చాం. అదే గతంలో  పెత్తందారులు మాత్రమే నామినేటెడ్ పదవులు అనుభవించేవారు. ఇళ్ల పట్టాల విషయంలో ప్రముఖలకు ఏవైతే పూర్తి హక్కులు ఇస్తారోపేదలకు కూడా అదే స్థాయిలో ఇవ్వాలని చట్టం చేశాం. ఈ రోజు నా పేదింటి కుటుంబాలకు అవే హక్కులు అందిస్తున్నాము. ఇదంతా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. పేదల ఏపీ వేరు, ధనంతుల ఏపీ అనే భావాలను తుడిచివేచేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగు  ముందుకే వేసింది.

ఈ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు ఉంటుంది. భవిష్యత్ లో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు. రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల కబ్జాలు చేసేందుకు కూడా వీలుపడదు. ఇలా పేదల ఆత్మగౌరవం పెంచేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తుంది. అదే గత ప్రభుత్వం మాత్రం పేదల ఆత్మగౌరవం గురించి  ఏ ఆలోచన చేయలేదు. ఇక పేదల ఆరోగ్యం విషయంలో మన ప్రభుత్వం ఎంతో శ్రద్ధగా ఉంది. అందుకే ఆరోగ్య సురక్ష పేరుతో ఇంటింటికి వెళ్లి వైద్యం అందిస్తున్నాం” అని సీఎం జగన్ తెలిపారు. అంతేకాక ఇళ్ల పట్టాలకు సంబంధించిన పలు అంశాలను ఈ సభ నుంచి సీఎం జగన్ ప్రస్తావించారు.

Show comments