YS Jagan: పేదల ప్రజలకు CM జగన్ గుడ్ న్యూస్..నిండు సభలో ప్రకటన!

పేదల ప్రజలకు CM జగన్ గుడ్ న్యూస్..నిండు సభలో ప్రకటన!

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతుంటారు. అలానే తాజాగా ఒంగోలు పర్యటనలో పేద ప్రజలకు ఓ శుభవార్త చెప్పారు. అది కూడా నిండు సభలో ఆ కీలక ప్రకటన చేశారు.

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతుంటారు. అలానే తాజాగా ఒంగోలు పర్యటనలో పేద ప్రజలకు ఓ శుభవార్త చెప్పారు. అది కూడా నిండు సభలో ఆ కీలక ప్రకటన చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి నేటి వరకు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు. పేదల అభివృద్ధే తన లక్ష్యం అన్నట్లు సీఎం జగన్ పాలన సాగుతోంది. ఈ 56 నెలల పరిపాలనలో బడుగు, బలహీన వర్గాల వారికి ఎన్నో సంక్షేమ, ఆర్థికంగా భరోసా ఇచ్చే కార్యక్రమాలను చేపట్టారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడప వద్దకే ప్రభుత్వ పథకాన్ని తీసుకెళ్తున్నారు. అంతేకాక పేదల సొంతిటి కలను నిరవేర్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది. అలానే తరచూ పేద ప్రజలకు సంబంధించి సీఎం జగన్ శుభవార్త చెబుతుంటారు. తాజాగా ఒంగోలు సభలో కూడా సీఎం జగన్  పేద ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

శుక్రవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించారు. ‘నవరత్నాలు-పేదల ఇళ్లు’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే 31.19 లక్షల ఇళ్ల పట్టాలను సీఎం జగన్ అందించారు. తాజాగా మరో 21,840 మందికి ఇళ్ల పట్టాలు అందించారు. ఈ సందర్భంగా 56 నెలల్లో తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను సీఎం జగన్ వివరించారు. అలానే చంద్రబాబు ఇంటికి కేజీ బంగారం అంటూ వాగ్దానాలు చేస్తారని, ఆయన ఒక రాజకీయ రాక్షసుడని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అలానే అక్కచెల్లెమ్మలకు డీబీటీ ద్వారా అందించిన నిధుల గురించి వివరించారు సీఎం జగన్. మన ప్రభుత్వం మహిళలకు, పేదల అభివృద్ధి కోసం కృష్టి చేస్తుంది. అలానే తమ ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగిందని, ఆర్థిక అంతరాలను తొలగించామని తెలిపారు. అలానే అక్కచెల్లెమ్మల కోసం అనేక సంక్షేమా, అభివృద్ధి పథకాలు తెచ్చామన్నారు. ఇదే నిండు సభలో సీఎం జగన్ పేదలకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇళ్లు కట్టుకునే వారికి ఇసుకను ఉచితంగా ఇస్తామని తెలిపారు.

ఆయన నిండు సభలో మాట్లాడుతూ..” మీ అందరికి ఒక విషయం తెలియజేస్తున్నాను. ఈ రోజు మీ అందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా, ఇళ్ల మంజూరు పత్రాలను కూడా మీకే ఇచ్చేస్తున్నాను. మీ అందరికి కూడా నేను చెప్పేది ఒక్కటి. మీలో ఎవరైనా ఇళ్లు కట్టుకోవాలంటే బంగారం లాగా కట్టుకోండి. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు సహకరిస్తుంది. లేదు.. మేము కట్టుకోలేము, ప్రభుత్వం కట్టించి ఇవ్వమంటే.. ఆఫ్షన్-3 కింద కలెక్టర్ ఆ అవకాశం మీకు ఇస్తారు. ఎవరైనా  ఆప్షన్ 3 కావాలంటే.. అది కూడా మేమే మా భుజాలపై వేసుకుని, ఇళ్లు కట్టించి ఇస్తాము. ప్రతి ఇంటికి కూడా రూ.1.80 లక్షలు ఇవ్పడం జరుగుతోంది. అలానే మరో 35వేల రూపాయలు 25పైసల వడ్డీకి రుణాలు ఇస్తూ తోడుగా నిలబడుతుంది. రూ.15 వేల విలువ చేసే ఇసుకను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా వివిధ రూపాల్లో 2.70 ఖర్చు అయ్యే ఈ ఇంటిని ఈ పత్రాలను మీ చేతుల్లో పెడతాం” అని పేద వారికి సీఎం జగన్ శుభవార్త చెప్పారు. మరి..ఒంగోలు సభలో సీఎం జగన్ చెప్పిన ఈ గుడ్ న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments