Revanth Reddy Tweet On 1 Month Ruling: నెల రోజుల పాలనపై CM రేవంత్ ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే

Revanth Reddy: నెల రోజుల పాలనపై CM రేవంత్ ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి.. నేటికి నెల రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి.. నేటికి నెల రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఓడిపోయి.. ప్రతిపక్ష పార్టీగా మిగిలింది. ఇక ఈ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించగా.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం.. 34 స్థానాలకే పరిమితం అయ్యింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడగా.. సరిగ్గా నెల రోజుల క్రితం అనగా డిసెంబర్ 7, 2023న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి నెల రోజులు పూర్తయ్యింది. ఈ క్రమంలో నెల రోజుల పాలనపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది వైరలవుతోంది. ఆ వివరాలు..

తన నెలరోజుల పాలనను గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ట్వీట్ చేశారు. ఈ 30 రోజుల పాలన తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందని తెలిపారు. “సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం నాకు ఎంతో తృప్తినిచ్చింది. మేం ప్రజలకు సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ.. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది” అంటూ రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

“పేదల సమస్యలు వింటూ.. యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖాల్లో ఆనందాలను చూస్తూ.. రైతుకు భరోసా కలిగిస్తూ.. సాగిన ఈ నెల రోజుల నడక రానున్న ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం మేం పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని చెప్పడమే కాక పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ.. మత్తులేని చైన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో.. ఈ నెల రోజుల పాలన ఉంతో బాధ్యతగా సాగింది రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఇక ముందు కూడా తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా నా బాధ్యతను నిర్వర్తిస్తాను.. మీ రేవంతన్న” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ముందుగా ఆరు గ్యారెంటీల అమలకై చర్యలు వేగవంతం చేసింది. ఫిబ్రవరి చివరి నాటికి.. ఆరు గ్యారెంటీల్లో ముఖ్యమైన వాటిని అమలు చేసి ప్రజల్లో తమ పాలనపై నమ్మకం కలిగించడమే కాక.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో.. వాటి గురించి ప్రచారం చేసుకుని.. లబ్ధి పొందే దిశగా అడుగులు ముందుకు వేస్తోంది.

Show comments