ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ ముఖ్యమైన పిలుపు

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ ముఖ్యమైన పిలుపు

ప్రజల ఇంటి వద్దకే వచ్చి అత్యుత్తమంగా ప్రభుత్వ సేవలను అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అభినందనలు తెలిపేలా రాష్ట్ర ప్రజలు ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ఇళ్ల బయటు వచ్చిన చప్పట్లు కొట్టాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. దేశంలో తొలిసారిగా మహాత్మా గాంధీ కలలుగన్నా గ్రామ స్వరాజ్యాన్ని జగన్‌ ప్రభుత్వం ఏపీలో అమలు చేసి ఈ రోజుకు ఏడాది అవుతోంది. గత ఏడాది అక్టోబర్‌ 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు అందిస్తున్నారు.

రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీకార్డు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర సేవలన్నీ ప్రజల ఇళ్ల వద్దే అందిచేలా రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పని చేస్తోంది. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఎలాంటి రాజకీయ సిఫార్సు లేకుండా, లంచాలు ఇవ్వనవసరం లేకుండా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. ఇలాంటి ఉన్నతమైన సేవలు అందిస్తున్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ప్రజలు అభినందనలు తెలపాలని సీఎం జగన్‌ కోరారు.

Show comments