YS Jagan Mohan Reddy: సిద్ధం సభలో అస్వస్థతకి గురై మరణించిన వ్యక్తి కుటుంబానికి 10,00,000 ఆర్థిక సాయం

సిద్ధం సభలో అస్వస్థతకి గురై మరణించిన వ్యక్తి కుటుంబానికి 10,00,000 ఆర్థిక సాయం

సిద్ధం సభలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అస్వస్థతకి గురై మరణించాడు. ఆ వ్యక్తి పట్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉండేందుకు ఆర్థిక సాయం ప్రకటించారు.

సిద్ధం సభలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అస్వస్థతకి గురై మరణించాడు. ఆ వ్యక్తి పట్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉండేందుకు ఆర్థిక సాయం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలు హీట్ పెంచేస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారాలకు తెరలేపాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లీడర్లు నియోజక వర్గాల్లో కలియతిరుగుతున్నారు. ఇక అధికార పార్టీ వైసీపీ మరోసారి అధికారం చేపట్టేందుకు ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉంది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వినూత్న పథకాలను ప్రవేశ పెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచింది జగన్ సర్కార్. ఈ క్రమంలో సీఎం జగన్ సిద్ధం సభల్లో పాల్గొంటూ ప్రతిపక్షాల కుట్రలను ఎండగడుతూ దూసుకెళ్తున్నారు. సిద్ధం సభలకు జనం నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మరోసారి వైసీపీ అధికారం చేపట్టడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఆదివారం బాపట్ల జిల్లాలో సిద్ధం సభ జరిగింది. ఈ సభకు లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇందుకోసం ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సభ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న జరిగిన సిద్ధం సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీ కృష్ణ మృతి చెందాడు. అతని మృతి పట్ల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉండేందుకు ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుని కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక గ్యాలరీ నుంచి మరో గ్యాలరీకి వెళ్తున్న క్రమంలో మృతుడు అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

Show comments