CM Breakfast Scheme: విద్యార్థులకు శుభవార్త.. 6న CM అల్ఫాహార పథకానికి శ్రీకారం

విద్యార్థులకు శుభవార్త.. 6న CM అల్ఫాహార పథకానికి శ్రీకారం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కేసీఆర్. ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువచ్చి ప్రజల మన్ననలు పొందుతున్నారు. తెలంగాణలో త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ తెలంగాణ విద్యార్థులకు మరో శుభవార్త తెలిపారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో దసరా నాటికి ప్రారంభించాల్సిన ‘సీఎం అల్హాహార పథకం’ ఈ నెల 6 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 13 నుంచి సెలవులు ఉండటంతో 6 నుంచి జిల్లాలకు ఒక పాఠశాలలో ఈ పథకాన్ని అమలు చేసే యోచనలు ఉంది తెలంగాణ సర్కార్. ఇక అక్టోబర్ 26 నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలలు 642, మోడల్ పాఠశాలలు 194, మదర్సాలు 100 ఉండగా.. వీటిలో 1.50లక్షలకు పైగా విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనున్నది. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్న తెలంగాణ సర్కార్ నాణ్యమైన పోషకాహారాన్ని అందించేందుకు ఈ అద్భుత పథకానికి శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థులకు ఆకలి బాధను తీర్చాలనే సంకల్పంతో ఈ అల్పాహార పథకం అమలు చేయనున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి ఈ అల్పహార పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.

Show comments