ఇక టవర్లు లేకుండా ఫోన్ సిగ్నల్స్.. ఎలాగంటే !

ఇక టవర్లు లేకుండా ఫోన్ సిగ్నల్స్.. ఎలాగంటే !

ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీలో ముందు ఉంటున్నది మాత్రం కమ్యూనికేషన్ టెక్నాలజీ. అయితే వీటి కోసం సెల్ ఫోన్ టవర్స్ ఉన్న సంగతి తెలిస్తే. కానీ, ఇకపై మాత్రం టవర్స్ లేకుండా కూడా సెల్ ఫోన్స్ లో మాట్లాడుకోవచ్చంట. అది ఎలానో చూద్దాం.

ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీలో ముందు ఉంటున్నది మాత్రం కమ్యూనికేషన్ టెక్నాలజీ. అయితే వీటి కోసం సెల్ ఫోన్ టవర్స్ ఉన్న సంగతి తెలిస్తే. కానీ, ఇకపై మాత్రం టవర్స్ లేకుండా కూడా సెల్ ఫోన్స్ లో మాట్లాడుకోవచ్చంట. అది ఎలానో చూద్దాం.

ఒకప్పటి ఇప్పటికి ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. మానవులు ఉపయోగేపడేలా ఎన్నో వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. పైగా వచ్చిన ఆ వస్తువులు కూడా.. ఎప్పటికప్పుడు ఈజీగా ఉపయోగించుకునే విధంగా.. అప్ డేట్ అవుతూ వస్తున్నాయి. ఈరోజుకి కూడా ఎక్కడో ఒక దగ్గర ఏవో ఒక కొత్త పరికరాలను సృష్టిస్తూనే ఉన్నారు. క్రమంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఒక ఉదారహరణ రూపంలో చెప్పాలంటే మాత్రం అది కేవలం కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పి తీరాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉత్తరాల ద్వారా ఉండే మనుషుల మధ్య కమ్యూనికేషన్ ను.. ల్యాండ్ ఫోన్స్ వరకు తీసుకుని వచ్చారు. ల్యాండ్ ఫోన్స్ నుంచి అవి వైర్ లెస్ ఫోన్స్ గా అభివృద్ధి చెందాయి. వైర్ లెస్ ఫోన్స్ ద్వారా కమ్యూనికేషన్ జరగాలంటే వాటిలో ఉండే సిమ్స్ ఉండాలి. ఇక ఆ సిమ్స్ పనిచేయాలంటే ఖచ్చితంగా ఆ నెట్ వర్క్ కు సంబంధించిన సెల్ టవర్స్ ఉండాలి. కానీ, ఇకపై మాత్రం ఇలాంటి సెల్ టవర్స్ లేకున్నా కూడా మొబైల్స్ కు సిగ్నల్స్ అందుతాయట . అది ఎలానో చూసేద్దాం.

సెల్ ఫోన్స్ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించిందన్నమాట ఎంత వాస్తవమో.. సెల్ ఫోన్స్ ద్వారా విడుదల అయ్యే రేడియషన్ కారణంగా వాతావరణానికి హాని కలుగుతుందన్న మాట కూడా అంతే వాస్తవం. పైగా సెల్ ఫోన్ టవర్స్ కారణంగా ఎన్నో మూగజీవాల ప్రాణాలకు నష్టం వాటిల్లుతుందన్న సంగతి అందరికి తెలిసిందే. అయినా సరే.. సెల్ ఫోన్స్ వినియోగం రోజు రోజుకు పెరుగుతుందే కానీ.. ఏ మాత్రం తగ్గదు. అందుకే వీటికి ప్రత్యామ్న్యాయంగా సెల్ ఫోన్స్ టవర్స్ లేకుండానే.. సెల్ ఫోన్స్ ను వినియోగించుకునేలా కొత్త పద్దతులను కనిపెట్టారు శాస్త్ర వేత్తలు. మొబైల్ కమ్యూనికేషన్ లో సాటిలైట్ కనెక్టివిటిని సాధించడంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. చైనా రోదసిలోకి పంపిన టియాంటాన్ సిరీస్ ఉపగ్రహాల సంఖ్య 3 కి చేరుకుంది. దీనితో ఆసియా, పసిఫిక్ ప్రాంతమంతా మొబైల్ సాటిలైట్ కనిక్టివిటీకి మార్గం సులువైంది.

ఇక ప్రపంచంలో సాటిలైట్ కనెక్టివిటీని సపోర్ట్ చేసి.. స్మార్ట్ ఫోన్స్ ను సపోర్ట్ చేసిన మొట్టమొదటి సంస్థగా హువాయ్ ఇప్పటికే గుర్తింపు పొందింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లో షావోమి, హానర్, ఒప్పో కంపెనీలు చేరాయి. భూకంపాలు, తుఫానులు వంటివి సంభవించినపుడు సాటిలైట్ కనెక్టివిటీ ముఖ్య పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొబైల్ ఫోన్స్ కు సాటిలైట్ కనెక్టివిటీ మరింత పాపులర్ అవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక రానున్న రోజుల్లో ఈ టెక్నాలిజీ మరింత అభివృద్ధి చెందుతుందని. ఒకవేళ ఇలా కనుక జరిగితే.. సెల్ టవర్స్ వలన వచ్చే సమస్యలు అన్ని కూడా దూరం అయిపోతాయని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments