Business Ideas-Tulsi Farming: తులసి అంటే దేవతే కాదు.. కాసులు కురిపించే ఆదాయ వనరు కూడా.. లక్షల్లో సంపాదన

తులసి అంటే దేవతే కాదు.. కాసులు కురిపించే ఆదాయ వనరు కూడా.. లక్షల్లో సంపాదన

తులసి అనగానే.. దేవత అని గుర్తుకు వస్తుంది. కానీ ఆయుర్వేదపరంగా కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. తులసి సాగు చేస్తే.. లక్షల్లో సంపాదించవచ్చు. ఆ వివరాలు..

తులసి అనగానే.. దేవత అని గుర్తుకు వస్తుంది. కానీ ఆయుర్వేదపరంగా కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. తులసి సాగు చేస్తే.. లక్షల్లో సంపాదించవచ్చు. ఆ వివరాలు..

తులసి అంటే హిందువులు దేవతగా భావిస్తారు. పురాణాల్లో కూడా తులసి ప్రస్తావన ఉంది. తెలుగు వారి లోగిళ్లల్లో కచ్చితంగా తులసి కోట ఉంటుంది. చాలా మంది ప్రతి రోజు తులసి చెట్టుకు పూజ చేస్తారు. ఇక ఆధ్యాత్మికంగానే కాక ఆయుర్వేదం పరంగా కూడా తులసికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలకు తులసి మంచి ఔషధంగా భావిస్తారు. చాలా మంది ప్రతి రోజు పరిగడుపునే తులసిని నీళ్లలో వేసి వేడి చేసుకుని తాగుతారు. ఔషధపరంగా ఈ మొక్కకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక తులసి వల్ల ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమే కాక ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. కేవలం 15-30 వేల రూపాయల పెట్టుబడితో తులసి సాగు ప్రారంభిస్తే.. లక్షల్లో ఆదాయం పొందవచ్చు దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది. ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

సమాజంలో రోజు రోజుకు కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. దాంతో ఆయుర్వేద మందులకు డిమాండ్‌ బాగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఔషధ మొక్కలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇక తులసి కూడా ఔషధ మొక్కల సాగు కిందకే వస్తుంది. దీనికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. సొంత పొలం ఉంటే చాలు. భూమి లేని వారు కాంట్రాక్ట్‌పై కూడా తీసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా కంపెనీలు కాంట్రాక్ట్‌పై ఔషధ మొక్కల పెంపకం చేస్తున్నాయి. వీటి సాగు కోసం 30 వేల రూపాయలలోపు ఖర్చు చేస్తే.. వచ్చే ఆదాయం మాత్రం లక్షల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఔషధ గుణాల పరంగా చూసుకుంటే తులసిని అనేక వ్యాధుల చికిత్సలో వాడతారు. అందుకే తులసి సాగు ద్వారా డబ్బు సంపాదించవచ్చు. తులసిలో అనేక మెడిసనల్‌ లక్షణాలు ఉన్నాయి. దీనిలో యూజినాల్, మిథైల్ సిన్నమేట్ ఉంటాయి. దానిని ఉపయోగించి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు మందులు తయారు చేస్తారు. ఒక హెక్టారు పొలంలో తులసి పండించడానికి రూ.15-30 వేలలోపు మాత్రమే ఖర్చవుతుండగా, మూడు నెలల తర్వాత మళ్లీ రూ.1.5-3 లక్షలకు విక్రయించవచ్చు.

తులసి సాగు ఎలా చేస్తారంటే.

తులసి సాగుకు ఇసుకతో కూడిన నేల ఉత్తమమైనదిగా భావిస్తారు. దీని సాగు కోసం, జూన్-జూలైలో పనులు ప్రారంభిస్తారు. విత్తనాల ద్వారా మొదట నర్సరీని తయారు చేస్తారు. నర్సరీలో మొక్కలు సిద్ధమైన తర్వాత వాటిని నాటుతారు. ఇక వీటిని నాటే సమయంలో లైన్ నుండి లైన్ వరకు దూరం 60 సెం.మీ. మొక్క నుండి మొక్కకు దూరం 30 సెం.మీ. ఉంచాలి. తులసి మొక్కలు వంద రోజుల్లోనే కోతకు వస్తాయి. ఆ తర్వాత వీటిని అవసరాలకు తగినట్లుగా కట్‌ చేసి.. ప్రాసెస్‌ చేసి అమ్ముకోవచ్చు.

ఈ కంపెనీలతో టైఅప్‌ అయితే..

పతంజలి, డాబర్, వైద్యనాథ్ తదితర ఆయుర్వేద ఔషధాలను తయారు చేసే కంపెనీలు కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్, కంపెనీల ద్వారా కూడా తులసి సాగు చేస్తున్నాయి. వారి నుంచి సదరు కంపెనీలు నేరుగా పంటను కొనుగోలు చేస్తారు.. తులసి గింజలు, నూనెకు పెద్ద మార్కెట్ ఉంది. ఆయుర్వేదం పరంగా డిమాండ్‌ బాగా ఉండటంతో.. ఎక్కువ ధరకే విక్రయిస్తారు. కనుక మీరు తులసి సాగు ప్రారంభిస్తే.. ఈ కంపెనీలతో టైఅప్‌ అయితే.. నేరుగా పంటను అమ్ముకోవచ్చు. నెలకు లక్షల్లో ఆదాయం పొందవచ్చు. పెట్టుబడి కూడా తక్కువ కాబట్టి రిస్క్‌ అసలు లేదు.. ఉన్నా చాలా తక్కువ.

Show comments