బొమ్మ బ్లాక్ బస్టర్ రిపోర్ట్

బొమ్మ బ్లాక్ బస్టర్ రిపోర్ట్

  • Published - 02:05 PM, Sat - 5 November 22
బొమ్మ బ్లాక్ బస్టర్ రిపోర్ట్

కెరీర్ ప్రారంభం నుంచి ఏళ్ళ తరబడి హీరోగా సినిమాలు చేసినా కెరీర్ పరంగా ఎలాంటి బ్రేక్ అందుకోలేకపోయిన నందు ఆ తర్వాత పెళ్లి చూపులు లాంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. అయినా ఏదో ఒక రోజు తనది కాకుండా పోతుందాని పట్టువదలని విక్రమార్కుడిలా దండయాత్ర కొనసాగిస్తూనే వచ్చాడు. ఆ మధ్య సవారిలో కష్టపడి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు కానీ కంటెంట్ మరీ బిలో యావరేజ్ ఉండటంతో ప్రేక్షకుల తిరస్కారం తప్పలేదు. ఇలాంటి పరిస్థితిలో నందు మరోసారి బొమ్మ బ్లాక్ బస్టర్ తో థియేటర్లలో అడుగు పెట్టాడు. భీభత్సమైన పోటీ ఉన్నా సరే కంటెంట్ మీద నమ్మకంతో దిగిపోయాడు. మరి బొమ్మలో విషయముందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

పోతురాజు(నందు)కు దర్శకుడు పూరి జగన్నాద్ అంటే విపరీతమైన అభిమానం. ఎప్పటికైనా ఆయనకు కథ చెప్పాలని ఒక స్క్రిప్ట్ రాసుకుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోగా ఊహించని పరిస్థితుల్లో తండ్రి హత్య చేయబడతాడు. ఒకపక్క తన లక్ష్యం మరోవైపు జన్మనిచ్చిన వాడి చావుకు కారణమైన వాళ్ళ అంతు చూసే పంతం. దీంతో పాటు నందు(నందు)అనే మరో కుర్రాడి ట్రాక్ పారలల్ గా నడుస్తుంది. ఇంతకీ పోతురాజు అనుకున్నది సాధించాడా, మధ్యలో ఎలాంటి సవాళ్లు ఎదురుకున్నాడు లాంటి ప్రశ్నలకు సమాధానం దొరికేది తెరమీదే. పెర్ఫార్మన్స్ పరంగా నందు బాగానే చేశాడు. కొన్నిచోట్ల డోస్ పెరిగింది. రష్మి ఎప్పటిలాగే అల్లుకుపోయింది.

కథలో చెప్పడమని కాదు కానీ దర్శకుడు రాజ్ విరాట్ మీద పూరి ప్రభావం చాలా బలంగా ఉందన్న సంగతి ఎక్కడికక్కడ ఇచ్చిన రెఫరెన్సులతోనే అర్థమైపోతుంది. తీసుకున్న పాయింట్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేసే క్రమంలో రాజ్ విరాట్ అవసరం లేని చాలా సన్నివేశాలకు చోటిచ్చి బోర్ కొట్టేందుకు అవకాశం కల్పించాడు. టెక్నికల్ గా సినిమా పర్లేదనిపించినా కథనం విషయంలో ఇంకొంచెం హోమ్ వర్క్ చేసుంటే మంచి అవుట్ ఫుట్ వచ్చేది. అయినా కూడా యూత్ ని విపరీతంగా నిరాశపరచదు కానీ సగటు ప్రేక్షకులకు మాత్రం టైటిల్ కు న్యాయం చేసే కంటెంట్ ఇందులో లేదనిపిస్తుంది. ఫైనల్ రిజల్ట్ ని డిసైడ్ చేసేది కూడా వీళ్ళే.

Show comments