47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కబోతున్న స్టార్ యాక్టర్! అమ్మాయి ఎవరంటే?

47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కబోతున్న స్టార్ యాక్టర్! అమ్మాయి ఎవరంటే?

  • Author Soma Sekhar Published - 06:45 PM, Sun - 26 November 23

తన 47 ఏళ్ల బ్యాచిలర్ జీవితానికి శుభం కార్డు వేసి.. తన ప్రియురాలిని వివాహం చేసుకోబోతున్న విషయాన్ని తెలియజేస్తూ.. ఒక ప్రత్యేక పోస్ట్ ను షేర్ చేశాడు స్టార్ యాక్టర్.

తన 47 ఏళ్ల బ్యాచిలర్ జీవితానికి శుభం కార్డు వేసి.. తన ప్రియురాలిని వివాహం చేసుకోబోతున్న విషయాన్ని తెలియజేస్తూ.. ఒక ప్రత్యేక పోస్ట్ ను షేర్ చేశాడు స్టార్ యాక్టర్.

  • Author Soma Sekhar Published - 06:45 PM, Sun - 26 November 23

2023లో చాలా మంది సెలబ్రిటీలు తమ బ్యాచిలర్ లైఫ్ లకు ముగింపు పలుకుతూ.. కొత్త జీవితాలను ప్రాంభించారు. తాజాగా మరో స్టార్ యాక్టర్ కూడా తన బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేశాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హుడా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. తన 47 ఏళ్ల బ్యాచిలర్ జీవితానికి శుభం కార్డు వేసి.. పెళ్లి డేట్ కార్డును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన ప్రియురాలిని వివాహం చేసుకోబోతున్న విషయాన్ని తెలియజేస్తూ.. ఒక ప్రత్యేక పోస్ట్ ను షేర్ చేశాడు.

రణ్ దీప్ హుడా.. 2001లో విడుదలైన ‘మాన్ సూన్ వెడ్డింగ్’ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత జిస్మ్ 2, బాంబే టాకీస్, కిక్, హైవే లాంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తన 47 ఏళ్ల సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి.. త్వరలోనే మింగిల్ అవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. తన పెళ్లి కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ కార్డులో.. “మహాభారతంలో మణిపూర్ యువరాణి చిత్రాంగదను అర్జునుడు ఎక్కడ పెళ్లి చేసుకున్నాడో.. అక్కడే మేము కూడా వివాహం చేసుకోబోతున్నాం. ఈ నెల 29న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మేము (రణ్ దీప్ హుడా-లిన్ లైస్రామ్) ఒక్కటి కాబోతున్నాం. మా ఈ కొత్త ప్రయాణానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం” అంటూ తన కార్డును పోస్ట్ చేశాడు. రణ్ దీప్ హుడా పెళ్లి చేసుకోబోయేది ఆమె ప్రియురాలు, బాలీవుడ్ మోడల్ లిన్ లైస్రామ్ నే. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీ ప్రముఖులు, నెటిజన్లు.

Show comments