Subramanian Swamy Praises CM Jagan: సీఎం జగన్‌పై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రశంసలు

CM Jagan: సీఎం జగన్‌పై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రశంసలు

బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి.. ఏపీ సీఎం జగన్‌ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఆ వివరాలు..

బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి.. ఏపీ సీఎం జగన్‌ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఆ వివరాలు..

ప్రజలే నా కుటుంబం.. వారి అభివృద్ధి తన ధ్యేయం.. ఇదే జగన్‌ నమ్మిన సూత్రం. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దీనికే కట్టుబడి ఉన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. అప్పుడే పుట్టిన చిన్నారులు మొదలు.. కాటికి కాళ్లు చాపిన వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి కోసం వివిధ రకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. ఇక విద్యా, వైద్య రంగాల్లో సమూల మార్పులు చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల, ఆస్పత్రి అంటే వామ్మో అనుకునే పరిస్థితి నుంచి నేడు వాటికే జై కొట్టే స్థితికి తీసుకువచ్చారు. కార్పొరేట్‌ స్కూల్స్‌, ఆస్పత్రులకు ధీటుగా వాటి రూపరేఖలు మార్చి.. సకల సౌకర్యాలు కల్పించారు. ఇక జగన్‌ తీసుకువచ్చిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.

విదేశీ ప్రతినిధులు సైతం జగన్‌ పాలన, పథకాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ జాబితాలో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి కూడా చేరారు. జగన్‌ను పొగడటమే కాక.. తమతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడిపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గురువారం నాడు తిరుమలకు వచ్చారు. ఆంధ్రజ్యోతిపై టీటీడీ 100 కోట్ల రూపాయల పరువు నష్టం కేసుకు సంబంధించి ఆయన నేడు కోర్టుకు హాజరయ్యారు. ఇక ఈ కేసు విచారణను కోర్టు మార్చి 27కి వాయిదా వేసింది. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. జగన్‌పై ప్రశంసలు కురిపించడమే కాక.. తమతో పొత్తు పెట్టుకున్న టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈసందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి జగన్‌ చాలా హార్డ్‌వర్క్‌ చేస్తున్నారు. ప్రజల్లో ఆయనపై ఎనలేని నమ్మకం ఉంది. జగన్‌ మరోసారి దాన్ని నిరూపించుకుంటారు’’ అని ప్రశంసించారు. ఇక టీడీపీతో పొత్తుపై స్పందిస్తూ.. ‘‘చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సోనియా గాంధీతో కలిశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక జరగాలి. ఎన్నికల కోసం సిద్ధమవ్వాలి’’ అని చెప్పుకొచ్చారు. విపక్ష పార్టీ నేత సైతం జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు అంటే అది కేవలం ఆయన పనితనమే అంటున్నారు జనాలు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments