అవయవ దానం -పునర్జన్మ-అవగాహన

అవయవ దానం -పునర్జన్మ-అవగాహన

  • Published - 05:27 PM, Thu - 20 February 20
అవయవ దానం -పునర్జన్మ-అవగాహన

2015 లో పునర్జన్మ ఫౌండేషన్ (Re-Birth Foundation)ప్రారంభించబడి అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.అవయవ దానం ఆవస్యకత, అపోహలపై వైద్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు ఎంత చెప్పినా చాలా మందికి అర్దం కావడం లేదు.ఇందుకోసంగా పునర్జన్మ -రీ బర్త్ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున జరుపుతున్న అవగాహన కార్యక్రమాలలో భాగంగా భారత్ ఆర్గాన్ యాత్ర-భారత అవయవ యాత్ర కార్యక్రమం గతంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా స్వచ్ఛందంగా బైకర్లు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు..

భారత్ ఆర్గాన్ యాత్రలో ప్రమోద్ మహాజన్ పునర్జన్మ కార్యకర్త .68 సంవత్సరాల మహాజన్ సుమారు 50ఏళ్ళ వయసులో తన కిడ్నిని ఒక మాజీ సైనికుడి కి దానం చేశారు.ఈ నిర్ణయం ఒక వ్యక్తి కి జీవితం ఇవ్వడం జరిగింది.

2018 వ సంవత్సరంలో భారత్ ఆర్గాన్ యాత్రను రీబర్త్-మైలేజ్ ముంచర్స్ సంయుక్త సహకారంతో నిర్వహించారు.ఆ సందర్భంగా మహాజన్ దేశవ్యాప్తంగా ఒంటరిగా బైక్ పై ప్రయాణించారు.తనకు ఎదురైన అనేక ఒడిదుడుకులను తట్టుకున్నారు.ఈ కార్యక్రమం పై దేశవ్యాప్తంగా 125 పత్రికలు, రేడియో, టి.విలలో తమ కధనాలను అందించాయి.అవయవ దానం పై తన కార్యక్రమం ద్వారా అనేక మందికి అవగాహన కల్పించారు.

మహాజన్ తన సామాజిక కార్యక్రమం తృష్ణ అంతటితో ముగియలేదు..Rebirth, ముంచర్స్ తో ZTCC పూనె, ROTTO స్వచ్ఛంద సంస్ధలు అధ్వర్యం లో 2020 జనవరిలో మరొక సారి భారత్ ఆర్గాన్ 2 ప్రారంభించాయి.ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 94నగరాలలో 142 రోజుల పాటు 17500 కిలోమీటర్ల పాటు సాగుతుంది.ఈ కార్యక్రమం 2020 మే లో తిరిగి పూనె లో ముగుస్తుంది..

Show comments