Bigg Boss 7 Telugu Sivaji Back Into House: ఆడియన్స్‌కి గుడ్‌న్యూస్‌.. శివాజీ ఈజ్‌ బ్యాక్‌.. అసలేం జరిగిందంటే

ఆడియన్స్‌కి గుడ్‌న్యూస్‌.. శివాజీ ఈజ్‌ బ్యాక్‌.. అసలేం జరిగిందంటే

ఉల్టా పుల్టా అంటూ ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌ 7లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు హీరో శివాజీ. ఇక షో ప్రారంభమైన నాటి నుంచి చాలా సెటిల్డ్‌గా ఆడుతూ.. పెద్ద మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వయసుకు తగ్గట్టుగా హుందాగా ప్రవర్తిస్తూ.. హౌజ్‌లోనే కాక.. బయట కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.  ఆ సంగతి అలా ఉంచితే.. శివాజీ యాక్ట్‌ చేస్తున్నారు.. పెద్దరికం పేరుతో పని తప్పించుకుంటున్నారు అనే వారు కూడా ఉన్నారు. సరే ఆ సంగతి కాసేపు పక్కకు పెడితే.. ఆదివారం ఎపిసోడ్‌ ముగిసిన తర్వాత టెలికాస్ట్‌ అయిన వీడియో చూసి ఆడియన్స్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సాధరణంగా వీకెండ్‌ ఎపిసోడ్‌ అంటే ఎలిమినేషన్స్‌ ముగుస్తాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా నయని పావని ఎలిమినేషన్‌ తర్వాత.. శివాజీ హౌజ్‌ నుంచి బయటకు రావడం.. అటు కంటెస్టెంట్లని.. ఇటు ఆడియెన్స్‌ను షాక్‌కు గురి చేసింది.

ఇక శివాజీ బయటకు వెళ్లడానికి కారణం.. అనారోగ్య సమస్యలు అని తెలుస్తోంది. ఆయన హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడాని కన్నా ముందు నుంచే.. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది. ఇక హౌజ్‌లోకి వెళ్లాక ఆ సమస్యలు మళ్లీ తిరగబెట్టాయట. మరీ ముఖ్యంగా వెన్ను నొప్పి, చెయి నొప్పితో బాధపడుతున్నారని.. అందుకే ఫిజికల్‌ టాస్క్‌లో యాక్టీవ్‌గా పాల్గొనలేకపోతున్నారని ఆయన అభిమానులు అంటున్నారు. దాంతో ముందు ముందు ఇది సమస్యగా మారుతుందని భావించి.. శివాజీని హౌజ్‌ నుంచి బయటకు పంపేశారు అనే టాక్‌ వినిపించింది. దాంతో ఆడియన్స్‌, శివాజీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయనను తిరిగి హౌజ్‌లోకి పిలిపించాలని డిమాండ్‌ చేయసాగారు.

ఈ క్రమంలో నేడు ఆడియన్స్‌కి బిగ్‌బాస్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. శివాజీని హౌజ్‌లోకి తిరిగి పంపి.. మరోసారి షాకిచ్చాడు. అది చూసి ఆడియన్స్‌తో పాటు హౌజ్‌మెట్స్‌ కూడా సంతోపడ్డారు. మరి ఇంతకు శివాజీ బయటకు ఎందుకు వెళ్లాడు.. ఎక్కడికి వెళ్లాడు అంటే.. అనారోగ్యంతో బాధపడుతున్న శివాజీని బయటకు తీసుకెళ్లి చికిత్స చేయించారని సమాచారం. ఆ తర్వాత శివాజీ హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చే వీడియోను.. తన టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎక్కడికీ వెళ్లేదేలే అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోలో శోభా, ప్రియాంక, పూజా కూర్చొని ఉంటే శివాజీ సైలెంట్‌గా లోపలికి వచ్చారు. శోభా.. ఏడిపిద్దామనుకున్నా మిమ్మల్ని అందరినీ కాసేపు సరదాగా.. అంటూ హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. మీరు నిజంగానే ఏడిపించారు.. అసలు ఎలా నిల్చున్నారో తెలుసా అక్కడికెళ్లి.. అంటూ ప్రియాంక అంది. మొత్తానికి బిగ్‌బాస్‌ ఇటు ఆడియన్స్‌ని.. అటు కంటెస్టెంట్లని ప్రాంక్ చేశాడు అని ఈ వీడియోతో అర్థం అవుతుంది.

Show comments