Bangladesh Praises AP Govt: రైతుల కోసం AP ప్రభుత్వం కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శం: బంగ్లాదేశ్‌ ప్రతినిధులు

రైతుల కోసం AP ప్రభుత్వం కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శం: బంగ్లాదేశ్‌ ప్రతినిధులు

Bangladesh Praises AP Government: ఏపీలో అమలవుతోన్న ప్రజా సంక్షేమ విధానాలపై బంగ్లాదేశ్‌ ప్రతినిధుల బృందం ప్రశంసలు కురిపించింది. ఆ వివరాలు.

Bangladesh Praises AP Government: ఏపీలో అమలవుతోన్న ప్రజా సంక్షేమ విధానాలపై బంగ్లాదేశ్‌ ప్రతినిధుల బృందం ప్రశంసలు కురిపించింది. ఆ వివరాలు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రజా సంక్షేమ కోసం కృషి చేస్తున్నారు. నవరత్నాల పేరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి కోసం సంక్షేమ పథకాలను తీసుకువచ్చి.. ఎలాంటి అవాంతరాలు లేకుండా అమలు చేస్తూ.. తన చిత్తశుద్దిని చాటుకుంటున్నారు. ఇక జగన్‌ సర్కార్‌ అమలు చేస్తోన్న అనేక పథకాలపై మన దేశంలోనే కాక విదేశాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతోన్న నాడు నేడు కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం వంటి చర్యలపై అమెరికా ప్రతినిధులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తాజాగా బంగ్లాదేశ్‌ ప్రతినిధులు ఆంధ్రాలో పలు రంగాల్లో అమలవుతోన్న విధానాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయా అంశాల్లో ప్రగతి సాధించడం కోసం తాము కూడా ఏపీని ఫాలో అవుతాం అన్నారు. ఆ వివరాలు..

ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం, ఆహార భద్రత, మహిళా, రైతు సాధికారత కోసం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నంటూ బంగ్లాదేశ్‌ ప్రతినిధి బృందం ప్రశంసలు కురిపించింది. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాల నుంచి తాము ఎంతో స్ఫూర్తి పొందామని.. తమ దేశంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల అమల్లో మహిళా సంఘాలు పోషిస్తున్న పాత్ర అద్భుతమంటూ బంగ్లా ప్రతినిధి ప్రశంసలు కురిపించింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన బంగ్లాదేశ్‌ ప్రతినిధి బృందం సభ్యులు మొహమ్మద్, రఫీకుల్‌ ఇస్లాం, తాఫిక్‌ హు­స్సేన్‌ షా చౌదురి, ఆఫ్రిన్‌ సుల్తానా, కపిల్‌కుమార్‌పాల్, శంసాద్‌ ఫర్జానా, ఏకేఎం జహీరుల్‌ ఇస్లాంలు శనివారం ఏలూరు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. వారి పర్యటనలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన న్యూట్రీ గార్డెన్స్, కిచెన్‌ గార్డెన్స్‌ను సందర్శించారు. పెదవేగి మండలం జనార్ధనవరంలో మిచాంగ్‌ తుపానుపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనని తికలించారు.

చిరుధాన్యాలు, పోషక విలువలు కలిగిన దినుసులతో తయారు చేసిన పిండి పదార్థాలతోపాటు, ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఆకుకూరలు, కాయగూరలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి, వాటి తయారీ గురించి తెలుసుకున్నారు. ప్రజారోగ్యం, వ్యవసాయ అభివృద్ధి, రైతులను ఆదుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు ఎంతో గొప్పగా ఉన్నాయని.. వీటిని తమ దేశంలో అనుసరిస్తాం అని వెల్లడించారు.

Show comments