Bangladesh-Fire Accident In Train: ప్యాసింజర్ రైల్లో మంటలు.. 4 బోగీలు దగ్దం.. ఐదుగురు సజీవదహనం

Fire Accident: ప్యాసింజర్ రైల్లో మంటలు.. 4 బోగీలు దగ్దం.. ఐదుగురు సజీవదహనం

రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 బోగీలు దగ్ధం అవ్వగా.. ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 బోగీలు దగ్ధం అవ్వగా.. ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్త ఏడాది ప్రారంభంలోనే అగ్ని ప్రమాదాలు జనాలను కలవరపెడుతున్నాయి. రెండు రోజుల క్రితం.. సీఎంఆర్ షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా.. బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇలా ఉండగానే.. తాజాగా రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 బోగీలు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగరు సజీవదహనం అయ్యారు. ఈ విషాదకర సంఘటన.. వివరాలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు.

ఈ విషాదకర సంఘటన.. బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. రెండు రోజుల్లో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈసమయంలో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం.. సంచలనంగా మారింది. ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత ఢాకా నగరం సమీపంలో మెగా సిటీ ప్రధాన రైల్వే స్టేషన్ గోపీబాగ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని ఢాకా నుంచి జెస్సోరేకు వెళ్తోన్న బెనాపొలే ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు చెలరేగి.. నాలుగు బోగీలు పూర్తిగా కాలిబూడిదయినట్టు ఫైర్ విభాగం అధికారి రక్జీబుల్ హసన్ తెలిపారు. దగ్దమైన బోగీల నుంచి ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్ కమాండర్ ఖండాకేర్ అల్ మెయిన్ వెల్లడించారు.

అయితే, మంటలు అంటుకున్న రైలు నుంచి వందల మందిని రక్షించినట్టు సహాయక సిబ్బంది ఒకరు వెల్లడించారు. తాము చాలా మందిని రక్షించాము కానీ, మంటలు వేగంగా వ్యాపించాయని అన్నారు. ఈ రైల్లో కొంత మంది భారతీయ పౌరులు కూడా ఉన్నట్టు బంగ్లాదేశ్ స్థానిక మీడియా తెలిపింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘ఈ అగ్ని ప్రమాద ఘటనను కుట్రగా అనుమానిస్తున్నాం’ అని పోలీస్ చీఫ్ అన్వర్ హుస్సైన్ ఏఎఫ్‌పీతో అన్నారు. అయితే అందుకు సంబంధించిన ఎలాంటి వివరాలను ఆయన వెల్లడించలేదు.

ఇక గత నెలలోనూ ఇక్కడ ఇటువంటి ప్రమాదమే చోటుచేసుకుంది.  బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ నేషనల్ పార్టీయే రైలును తగలబెట్టినట్లు పోలీసులు, ప్రభుత్వం ఆరోపించాయి. కానీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఇదంతా ప్రతిపక్షాలను విచ్చిన్నం చేసేందుకు ప్రభుత్వం చేస్తోన్న తప్పుడు ప్రచారం అని మండిపడింది. బంగ్లాదేశ్‌లో ఆదివారం ఎన్నికలు జరగనుండగా.. ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ సహా పలు పార్టీలు వీటిని బహిష్కరించాయి. ఇవి బూటకపు ఎన్నికలని ఆరోపిస్తున్నాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా కోరుతూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన వేలాది మంది గత డిసెంబరులో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టడంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

Show comments