బనారస్ రిపోర్ట్

బనారస్ రిపోర్ట్

  • Published - 12:05 PM, Sat - 5 November 22
బనారస్ రిపోర్ట్

మాములుగా కొత్త హీరోని లాంచ్ చేసేటప్పుడు బడ్జెట్ పరంగా రిస్కులు చేయకుండా ఏదైనా లవ్ స్టోరీతో లాగించే ప్రయత్నం చేస్తారు నిర్మాతలు. అలా కాకుండా పెద్ద బ్యాక్ గ్రౌండ్, ఖర్చు విషయంలో ఎలాంటి లెక్కలు అవసరం లేనప్పుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్, గల్లా అశోక్ లాంటి వాళ్లకు గ్రాండియర్లతో కెరీర్ మొదలవుతుంది. ఆ సిరీస్ లో పరిచయమయ్యే ప్రయత్నం చేసిన నూతన కథానాయకుడు జయేద్ ఖాన్. కన్నడలో బనారస్ పేరుతో రూపొందిన ఈ ఫాంటసి కం సోషల్ థ్రిల్లర్ కు ప్రమోషన్లు భారీగా చేశారు. వ్యాపారవేత్త కుటుంబం నుంచి వచ్చిన ఇతనికి ఏకంగా ప్యాన్ ఇండియా రిలీజ్ ఇచ్చేశారు. మరి ఏ మాత్రం మెప్పించిందో రిపోర్ట్ లో చూద్దాం.

సిద్దార్థ్(జాయేద్ ఖాన్)ది బెట్లు కట్టే మనస్తత్వం. సింగర్ ధని(సోనాల్ మోంటెరో)ని ప్రేమలో పడేస్తానని స్నేహితులతో పందెం కాసి ఆమెకు లేనిపోని అబద్దాలు చెప్పి నిజంగానే బుట్టలో వేసుకుంటాడు. తనతో ఏకాంతంగా ఉన్న ఫోటోని ఫ్రెండ్స్ పంపించి తన గెలుపుని చూపిస్తాడు. ఇది కాస్తా బయటికి పొక్కడంతో పరువుపోయిన ధని మనస్థాపంతో బనారస్ వెళ్ళిపోతుంది. తప్పు తెలుసుకున్న సిద్ధార్థ్ ఆమె కోసం అక్కడికి వెళ్తాడు. బనారస్ లో అడుగుపెట్టిన క్షణం నుంచి అతనికి అనూహ్యమైన సంఘటనలు ఎదురవుతాయి. టైం లూప్ కాలంలో ముందుకు వెనక్కు వెళ్లి వస్తుంటాడు. ఊహించని మలుపులు వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెరమీదే చూడాలి మరి.

టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికీ దర్శకుడు జయతీర్థ మళ్ళీ దాన్నే ఎంచుకోవడం సాహసమే. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా మ్యాటర్ లేకుండా నడిపించిన వైనం బోర్ కొట్టించగా సెకండ్ హాఫ్ లో కొన్ని మలుపులు ఆసక్తికరంగా సాగాయి. అయితే లూప్  థీమ్ కాబట్టి సన్నివేశాలు పదే పదే రిపీట్ కావడం ఒకదశ దాటాక విసుగు పుట్టిస్తుంది. ఇంత బిల్డప్ ఇచ్చి క్లైమాక్స్ ని చప్పగా తేల్చేయడం ఓవరాల్ ఇంప్రెషన్ ఇంకా తగ్గించేసింది. హీరో హీరోయిన్ బాగానే చేశారు. ఖర్చు విషయంలో రాజీ పడలేదు. టెక్నికల్ టీమ్ కూడా బాగా కుదిరింది. ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల బనారస్ ఖచ్చితంగా థియేటర్ ని డిమాండ్ చేసే సినిమా కాలేకపోయింది.

Show comments