Attack On CM Jagan Police Investigation: CM జగన్ పై దాడి.. దర్యాప్తు చేస్తోన్న అధికారులు.. వెలుగులోకి కీలక విషయాలు

CM జగన్ పై దాడి.. దర్యాప్తు చేస్తోన్న అధికారులు.. వెలుగులోకి కీలక విషయాలు

Attack On CM Jagan: సీఎం జగన్ పై దాడి ఘటనలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..

Attack On CM Jagan: సీఎం జగన్ పై దాడి ఘటనలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి గురించి తెలుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అలానే దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిన దాడి అని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్యలోని చెట్ల దగ్గర నుంచి అటాక్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

కుడివైపు జనావాసాలు ఉండడంతో.. నిందితుడు ఎడమవైపున ఉన్న వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని దాడి చేయడానికి ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దాడి జరిగే సమయానికి పూర్తిగా చీకటి పడటం.. పైగా చెట్లు అడ్డుగా ఉండడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. అంతేకాకుండా దాడి తర్వాత అక్కడ నుంచి సులభంగా తప్పించుకోవచ్చని భావించే నిందితుడు ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 30 అడుగుల దూరం నుంచి ఆగంతకుడు.. సీఎం జగన్‌పై దాడి చేశాడు.

ప్లాన్ ప్రకారమే దాడి..

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎ జగన్ బస్సు యాత్ర చేస్తున్నారు. దాంతో ఆయన షెడ్యూల్ ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంది. దాని ప్రకారం సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం రాత్రి విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు.. ఇందుకు తగ్గట్టుగానే.. దాడికి ప్లాన్ చేసుకున్నాడనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ బస్సు యాత్ర శనివారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలోకి ప్రవేశించింది. అయితే యాత్ర సాగే మార్గంలో విద్యుత్‌ సరఫరాను నిలిపేస్తుండటాన్ని ఆగంతకుడు తనకు అనుకూలంగా చేసుకున్నాడని భావిస్తున్నారు.

సీఎం జగన్‌పై ఎయిర్‌ గన్‌ తో హత్యాయత్నం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సౌండ్‌ విన్నానని చెబుతుండటంతో సీఎంపై దాడికి ఎయిర్‌ గన్‌నే వినియోగించి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కూడా సీఎం వైపు దూసుకొచ్చిన పదునైన వస్తువు వేగాన్ని బట్టి ఇది హత్యాప్రయత్నమే అన్నారు. త్వరలోనే మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు అధికారులు.

Show comments