Attack On Indian Air Force Convoy: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉగ్రవాదుల కాల్పులు!

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉగ్రవాదుల కాల్పులు!

Attack On Air Force Convoy: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై ఉగ్రమూకలు కాల్పులు జరిపాయి. ఈ దాడిలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Attack On Air Force Convoy: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై ఉగ్రమూకలు కాల్పులు జరిపాయి. ఈ దాడిలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

దేశం మొత్తం ఉలిక్కిపడే ఘటన జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉగ్రమూక కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు వాహనాలపై ఉగ్రమూక కాల్పులు జరిపింది. అదనపు బలగాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడి ఘటనలో మొత్తం నలుగురు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వాహనాల్లో ఒక దానిపై విండ్ షీల్డ్ మీదే 12 బుల్లెట్ల హోల్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ దాడి ఘటనలో అంతా గాయాలతో బయటపడ్డారు.

పూంచ్ జిల్లాలో ఇలా దాడి జరిగిందని సమాచారం అందడంతోనే రీఎన్ ఫోర్స్ మెంట్ ఘటనాస్థలానికి పరుగులు తీసింది. ఉగ్రమూకను ఏరేసేందుకు గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇదే అతి పెద్ద ఉగ్రదాడి. గతేడాది ఈ ప్రాంతంలో చాలానే ఉగ్రవాదుల దాడులు జరిగాయి. వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. కానీ, ఈ ఏడాదిలో ఇలాంటి దాడి జరగడం ఇదే తొలిసారి. పక్కా పథకం ప్రకారమే కాపుకాసి దాడి చేసినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. దాడిగి గురైన వాహనాలను దగ్గర్లోని ఎయిర్ బేస్ ప్రాంతంలో భద్ర పరిచారు. ఈ దాడిలో గాయపడిన హెలికాప్టర్లో ఉద్దమ్ పూర్ లోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ దాడితో స్థానికులు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.

Show comments