YSR Cheyutha Funds-Feb 16th 2024: AP మహిళలకు గుడ్‌ న్యూస్‌.. వారి ఒక్కొక్కరి ఖాతాలో రూ.18,750 జమ

AP మహిళలకు గుడ్‌ న్యూస్‌.. వారి ఒక్కొక్కరి ఖాతాలో రూ.18,750 జమ

ఏపీలోని అర్హులైన మహిళల ఖాతాలో రూ.18,750 జమ చేసేందుకు రెడీ అవుతోంది జగన్‌ సర్కార్‌. ఆ వివరాలు..

ఏపీలోని అర్హులైన మహిళల ఖాతాలో రూ.18,750 జమ చేసేందుకు రెడీ అవుతోంది జగన్‌ సర్కార్‌. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ.. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన చిత్తశుద్ది పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి ఒక్కొక్కరి ఖాతాలో 18,750 రూపాయలు జమ చేయనుంది. మరి ఇంతకు ఈ మొత్తం ఏ పథకానికి సంబంధించింది.. ఎప్పుడు జమ చేస్తారు వంటి వివరాలు..

వైఎస్సార్‌ చేయూత పథకంలో భాగంగా అర్హులైన మహిళల ఖాతాలో నిధులు జమ చేయనుంది ఏపీ సర్కార్‌. ఈ నెల 16న చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్సార్ చేయూత పథకం డబ్బుల్ని విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. 16న కుప్పం సభలో పాల్గొని.. బటన్ నొక్కి డబ్బుల్ని విడుదల చేస్తారు. అనంతరం జరిగే సభలో మాట్లాడతారు. వైఎస్సార్ చేయూత పథకం కింద ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.18,750 అందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈసారి ప్రభుత్వ పథకాలు, అకౌంట్లలో డబ్బులు జమ చేసే షెడ్యూల్‌ను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేశారు. ఫిబ్రవరి 16న కుప్పం నుండి వైయస్సార్ చేయూత విడుదల చేస్తారు. ఫిబ్రవరి 21న అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నిధులు.. ఫిబ్రవరి 24 కర్నూలు నుంచి వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేస్తారు. అలానే ఫిబ్రవరి 27న గుంటూరులో విద్యా దీవెన 4వ విడత నిధులు విడుదల చేయనున్నారు. మార్చి 5న సత్యసాయి జిల్లా నుంచి వసతి దీవెన రెండో విడత విడుదల చేస్తారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమం షెడ్యూల్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. దీన్ని ఈ నెల అనగా ఫిబ్రవరి 3వ, 4వ వారంలో నిర్వహించే అవకాశం ఉంది.

చేయూత పథకం ఎందుకంటే..

ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల మహిళలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడం కోసం ఏపీ ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించింది. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నాలుగేళ్ల వ్యవధిలో రూ.75వేలు ప్రభుత్వం అందిస్తుంది. ఇందుకోసం ఏడాదికి రూ.18,750ను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఈ పథానికి అర్హులు.

మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు రూ. 10,000..పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12,000 లుగా నిర్ణయించారు. ఇక కుటుంబం మొత్తం భూమి 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల తడి, పొడి భూమి కలిపి మించకూడదు అనే నిబంధన ఉంది. అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి.

Show comments