Village Ward Secretariat Employees Rationalization: AP గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Village Ward Secretariat: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

Village Ward Secretariat: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన వాలంటీర్‌ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రజల గడప వద్దకు పాలనను తీసుకెళ్లడమే కాక.. యువతకు ఉన్న ఊరిలో ఉపాధి కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ఈ క్రమంలో తాజాగా వాలంటీర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వారికి శుభవార్త అనే చెప్పవచ్చు. ఇంతకు ఏంటా నిర్ణయం అంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా.. ఏపీ సర్కార్‌ సర్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులున్నారు. ప్రస్తుతం దాదాపు 7,900 సచివాలయాల్లో 8 మందికంటే ఎక్కువగానే ఉద్యోగులు ఉండగా.. సుమారు 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు. మిగిలిన చోట్ల 8 మంది చొప్పున పనిచేస్తున్నారు. దాంతో ప్రభుత్వం.. ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉన్న సచివాలయాలకు ఉద్యోగులను సర్దుబాటు చేసే పనిలో ఉంది.

అన్ని సచివాలయాల్లో సమాన సంఖ్యలో ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం రేషనలైజేషన్‌ దిశగా చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు విధి విధానాలతో గ్రామ, వార్డు సచివాలయాలు – వాలంటీర్లు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ ఆదేశాలు జారీ చేశారు. 8 మంది పనిచేస్తున్న చోట ఎవరికీ బదిలీలు ఉండవని అధికారులు తెలిపారు. 5,000 మందికి స్థాన చలనం కలుగుతుందన్నారు. జిల్లాల ప్రాతిపదికన కలెక్టర్ల ఆధ్వర్యంలో సర్దుబాటు జరుగుతుంది అంటున్నారు.

ఏ జిల్లాలోని వారికి ఆ జి­ల్లా­లో­నే బదిలీ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముం­దే రానున్న పది పదిహేను రోజుల్లో మొత్తం ప్ర­­క్రియ పూర్తవుతుందని అధి­కా­లు తెలిపారు. అలానే ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సన్మానిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగాంగా వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇక ఏడాదికి సంబంధించి షెడ్యూల్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. దీన్ని ఈ నెల అనగా ఫిబ్రవరి 3వ, 4వ వారంలో నిర్వహించే అవకాశం ఉంది.

 

Show comments