YS Jagan On Rs 5000 Aarogyasri Pension For Patients: వారికి జగన్‌ సర్కార్‌ శుభవార్త.. ఆ రోజు నుంచే ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ. 5 వేలు

వారికి జగన్‌ సర్కార్‌ శుభవార్త.. ఆ రోజు నుంచే ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ. 5 వేలు

జనాలకు వచ్చే ప్రతి సమస్య, కష్టానికి పరిష్కారం చూపుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అధికారమంటే.. అజమాయిషీ కాదు.. ప్రజలపై మమకారం చూపాలి.. అప్పుడే అతడు జనం మెచ్చిన నాయకుడవుతాడు అని పెద్దల మాట. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు సీఎం జగన్‌. అన్నా.. అని పిలిస్తే చాలు.. వెంటనే స్పందించి.. సమస్య ఎంత పెద్దది అయినా సరే.. తక్షణం దానికి పరిష్కారం చూపుతూ.. అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నారు సీఎం జగన్‌. మరీ ముఖ్యంగా జనాలకు అందని ద్రాక్షగా ఉన్న నాణ్యమైన విద్య, వైద్యాలను పేదలకు ఉచితంగా.. లేదంటే అతి తక్కువ ఖర్చుకే అందించే దిశగా కృషి చేస్తున్నారు సీఎం జగన్‌. ఈ క్రమంలో ఏపీలో అమలవుతోన్న ఆరోగ్యశ్రీ పథకం.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య శ్రీకి సంబంధించి సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. సెప్టెంబరు 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం జగన్‌. తాజాగా ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స పొందిన పేషెంట్లకు.. వైద్యులు సూచించిన విశ్రాంత సమయంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకం కింద.. వారికి నెలకు రూ.5 వేల వరకూ జీవన భృతి ఇస్తున్నామని తెలిపారు సీఎం జగన్‌. రోగికి అందించే ఈ సాయాన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే ఇవ్వాలని ఆదేశించారు. దీనికి కావాల్సిన ఎస్‌ఓపీని రూపొందించాలని అధికారులకు సూచించారు సీఎం జగన్‌.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి.. ఆరోగ్యశ్రీ సేవలను ఎలా పొందాలనే అంశంపై జనాలకు.. విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి, వారి పరిధిలో.. ప్రజల ఇంటి వద్దకే వెళ్లి.. వారికి ఆరోగ్యశ్రీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించాలన్నారు. రూ.5 లక్షలు లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే.. వారు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా.. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు. దీనిపై రాఫ్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Show comments