YS Jagan-YSR Cheyutha Funds: AP మహిళలకు శుభవార్త.. నేడే వారి ఖాతాల్లో రూ.18, 750 జమ

AP మహిళలకు శుభవార్త.. నేడే వారి ఖాతాల్లో రూ.18, 750 జమ

ఏపీ మహిళలకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న ఓ పథకానికి సంబంధించిన నిధులను ఈ రోజు వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఆ వివరాలు..

ఏపీ మహిళలకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న ఓ పథకానికి సంబంధించిన నిధులను ఈ రోజు వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఆ వివరాలు..

ఏపీలో మహిళలకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఓ పథకానికి సంబంధించిన నిధులను నేడు అనగా.. గురువారం (మార్చి 07న) వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈక్రమంలో జగన్‌ నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సభలో పాల్గొన్న తర్వాత బటన్‌ నొక్కి నిధులు విడుదల చేస్తారు. ఆ తర్వాత జనాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పథకం నిధుల విడుదల కోసం మహిళలు కొన్ని రోజులుగా ఎదురు చూస్తుండగా.. నేడు జమ కానున్నాయి. ఇంతకు ఏంటా పథకం.. ఎంత మొత్తం నిధులు జమ అవుతాయి అంటే..

వైఎస్సార్‌ చేయూత నాలుగో విడత నిధులను గురువారం నాడు సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేక విమానంలో ఉదయం 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు బయలరు దేరి.. ఉదయం 11.15 గంటలకు పిసినికాడ వద్ద గల సభావేదిక వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత 11.20 గంటలకు వేదికపై మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పిస్తారు. 11.40 గంటల నుంచి 12.40 గంటల వరకు గంట పాటు సీఎం ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్‌ చేయూత చివరి విడత నిధుల పంపిణీని బటన్‌ నొక్కి వారి  ఖాతాల్లో జమ చేస్తారు.

అంతేకాక మహిళామార్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.55 గంటలకు బయలుదేరి కశింకోటలో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. గంటసేపు ప్రజాప్రతినిధులతో ముచ్చటించిన అనంతరం 2.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 2.35 గంటలకు విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు తిరిగి పయనమవుతారు.

వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ఏపీ సర్కార్‌.. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 ఇస్తున్నారు. ఇప్పుటికే మూడు విడతలుగా నిధులు విడుదల చేయగా.. ఇప్పుడు చివరి విడత నిధులను జమ చేస్తున్నారు. ఈ పథకం కింద మొత్తం 31,23,466 మంది మహిళలు లబ్ధిదారులుగా ఉండగా.. ఇప్పటివరకు వారికి రూ.14, 129 కోట్లు అందించారు.

ఎవరు అర్హులంటే..

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
  • ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్ ఉండాలి.
  • గ్రామీణ ప్రాంతాల వారికి అయితే వారి వార్షికాదాయం రూ.10వేలు,
  • పట్టణ ప్రాంతాల వారి వార్షికాదాయం రూ.12వేలకు మించకూడదు.
  • అంతేకాదు మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి, మెట్ట కలిపి పది ఎకరాలకు మించకూడదు.
  • ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి పించన్ తీసుకునేవారు కూడా అనర్హులు.
  • ఇంటి కరెంట్ వినియోగ బిల్ సరాసరి 300 యూనిట్లలోపు ఉండాలి.
  • పట్టణ ప్రాంతాల్లో ఎవరికైనా 750 చదరపు గజాలలోపు ఉండాలి.
  • ఆదాయపు పన్ను చెల్లించేవారు.. ఫోర్ వీలర్ ఉన్నవాళ్లు అనర్హులు.

ఈ ఏడాదికి సంబంధించిన కొత్త దరఖాస్తుల ప్రక్రియ గతేడాది డిసెంబర్‌లోనే పూర్తైంది. వెరిఫికేషన్ ప్రక్రియ కూడా డిసెంబర్‌లోనే పూర్తి చేశారు.

Show comments