జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో మరో సంచలనం.. ఆ ఫాం హౌస్ ఎవరిది ?

జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో మరో సంచలనం.. ఆ ఫాం హౌస్ ఎవరిది ?

జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన కేసులో మరో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ లో ఉన్న ఫాంహౌస్ వద్ద ఒక ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. నిందితులు ఒక రాజకీయ నేతకు చెందిన ఫాం హౌస్ లో తలదాచుకున్నారని, అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారని సమాచారం.

నిందితులు తమ ఇన్నోవా కారును ఫాం హౌస్ వెనుక దాచినట్లు తెలుస్తోంది. నిందితులు తెలివిగా తమ సిమ్ కార్డులను వేరే ఇద్దరు వ్యక్తుల ఫోన్లలో వేసి.. వారిని గోవాకు పంపించారని, ఆ తర్వాత వారు కర్ణాటకకు పారిపోయినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్న ఒక మైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకొచ్చారు. అతడిని ఓ రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ చేస్తున్నారు. కాగా.. నిందితులు ఆశ్రయం పొందిన ఆ ఫాం హౌస్ ఎవరిదన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ కేసులో మరో నిందితుడైన ఉమేర్ ఖాన్ ను జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ చేస్తున్నారు.

 

Show comments