Anjali New Web Series: అంజ‌లి కొత్త రివేంజ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ .. వచ్చేది ఆ OTTలోకే!

అంజ‌లి కొత్త రివేంజ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ .. వచ్చేది ఆ OTTలోకే!

టాలీవుడ్ హీరోయిన్ అంజలి కొత్త కొత్త కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ షురూ చేస్తుంది. ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో పలకరించిన ఈ బ్యూటీ.. మరో వెబ్ సిరీస్ చేస్తుంది.

టాలీవుడ్ హీరోయిన్ అంజలి కొత్త కొత్త కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ షురూ చేస్తుంది. ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో పలకరించిన ఈ బ్యూటీ.. మరో వెబ్ సిరీస్ చేస్తుంది.

ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ.. మెస్మరైజ్ చేస్తుంది టాలీవుడ్ నటి అంజలి. ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో పలకరించింది. గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో రత్నమాల అనే వేశ్య పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్-శంకర్ గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ చేస్తుంది. అలాగే అటు వెబ్ సిరీస్ కూడా షురూ చేసింది. ఝాన్సీ, ఫాల్ వంటి వెబ్ సిరీస్‌ల్లో ఫెర్ఫామెన్స్ అదరగొట్టిన అంజలి బహిష్కరణ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఈ రోజు సీతమ్మ పుట్టిన రోజు సందర్భంగా పురస్కరించుకుని ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో ఎన్నడూ చూడని మాస్ అంజలి కనిపిస్తుంది. అనన్య నాగళ్లతో కలిసి ఈ వెబ్ సిరీస్ చేస్తుంది అంజలి.

 మంటల్లో భగ్గుమని మండుతున్న కుర్చీ పక్కన కూర్చొన్న అంజలి కొడవలి చేత పట్టి.. రౌద్రంగా అరుస్తూ కనిపిస్తుంది. ఆమె చీర కట్టు బొట్టును బట్టి చూస్తే పల్లెటూరి మహిళగా కనిపించబోతుంది. ఈ సిరీస్ గత సినిమాలకు, సిరీస్‌లకు కాస్త భిన్నంగానే ఉండబోతుంది. మరోసారి అంజలి మరో విలక్షణమైన పాత్రలో రఫ్డ్ క్యారెక్టర్‌తో మెప్పించబోతుంది. ఓ సర్పంచ్ చేతిలో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళ.. పగ తీర్చుకునే రీవేంజ్ డ్రామా ఈ వెబ్ సిరీస్ అని తెలుస్తుంది. అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్నఈ సిరీస్‌లో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు.ఈ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెలలోనే  స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఫిక్సల్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రశాంతి మలిశెట్టి నిర్మిస్తోంది.  ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఫోటో మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అంజలి..  ప్రేమ లేఖ రాశా అనే చిత్రం చేసి.. కోలీవుడ్ బాట పట్టి అక్కడ సక్సెస్ కొట్టింది. ఐదేళ్ల తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో తెలుగు ప్రేక్షకులకు సీతగా మారిపోయింది. సహజ నటిగా పేరు తెచ్చుకుంది. అక్కడ నుండి వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ అయ్యింది. చిత్రంగద తర్వాత మళ్లీ మూడేళ్లు గ్యాప్ ఇచ్చి.. కొత్తగా ట్రై చేస్తుంది. నిశ్శబ్దం, వకీల్ సాబ్, ఐరట్టా వంటి చిత్రాలు అందుకు ఉదాహరణలు. అలాగే  ఇటీవల చేసిన వెబ్ సిరీస్ కూడా ఉమెన్ సెంట్రిక్ గా నిలుస్తున్నాయి. ఇప్పుడు రాబోతున్న బహిష్కరణ కూడా ఇదే  కోవలోకి వస్తుంది.

Show comments