OTT Movies- Best Suspense Crime Thriller: OTTలో సీరియల్ కిల్లర్.. అమ్మాయిలను టార్గెట్ చేసి.. ఒక్కో సీన్ కి వణికిపోతారు!

OTTలో సీరియల్ కిల్లర్.. అమ్మాయిలను టార్గెట్ చేసి.. ఒక్కో సీన్ కి వణికిపోతారు!

OTT Suggestions- Best Suspense Crime Thriller: మీకు మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసే అలవాటు ఉంటే మాత్రం మీకు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒక సీరియల్ కిల్లర్ ఏకంగా మొత్తం సీబీఐ డిపార్ట్మెంట్ నే ఛాలెంజ్ చేస్తాడు.

OTT Suggestions- Best Suspense Crime Thriller: మీకు మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసే అలవాటు ఉంటే మాత్రం మీకు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒక సీరియల్ కిల్లర్ ఏకంగా మొత్తం సీబీఐ డిపార్ట్మెంట్ నే ఛాలెంజ్ చేస్తాడు.

ఓటీటీలో మీకు సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసే బ్యాడ్ హ్యాబిట్ ఉందా? అందులోనూ ఈ సీరియల్ కిల్లర్స్, అమ్మాయిలను టార్గెట్ చేసి వెంటాడటం వంటి సినిమాలు చూస్తారా? మీకు అలాంటి అలవాటు ఉంటే.. మీకోసం ఒక అదిరిపోయే సినిమాని తీసుకొచ్చాం. అది చూస్తే మీకు చెమటలు పట్టడం, చొక్కాలు తడిసిపోవడం కన్ఫామ్ అని చెప్పచ్చు. ఎందుకంటే అలాంటి ఒక కథ, సస్పెన్స్, థ్రిల్స్ ఆ మూవీలో ఉన్నాయి కాబట్టి. పైగా ఇందులో బెస్ట్ ఇన్వెవస్టిగేషన్ కూడా ఉంటుంది. కాకపోతే పోలీసుల కంటే హంతకుడే కాస్త ఫాస్ట్ గా ఉంటాడు. చురుగ్గా ఆలోచిస్తాడు. అలాంటి ఒక కిల్లర్ ఎదురైనప్పుడు పోలీసులు ఎలా ఫీలవుతారు? అతడిని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు? అన్నీ తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఓటీటీలో మీరు చాలానే సస్పెన్స్ థ్రిల్లర్స్, సైకో పాథ్ మూవీస్ చూసుంటారు. కానీ, ఇది మాత్రం మీకు నెక్ట్స్ లెవల్ చిల్ ఇస్తుంది. ఒక్కో సీన్ లో అయితే వెన్నులో వణుకు పుడుతుంది. ఇవన్నీ సినిమాకి హైప్ ఇవ్వడానికి కాదండోయ్.. సీన్స్ ఆ రేంజ్ లో ఉంటాయని మీకు భరోసా కలిగించడమే. అంతేకాకుండా ఇందులో ఇంకో వణుకుపుట్టించే ఎలిమెంట్ ఏంటంటే.. ఆ కిల్లర్ అంత తేలిగ్గా హత్యలు చేయడు. రాత్రిపూట ఒంటరిగా తిరిగే అమ్మాయిలను సెలక్ట్ చేసుకుంటాడు. ఆ అమ్మాయి కచ్చితంగా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయిపై అకస్మాత్తుగా దాడి చేసి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత దారుణంగా హత్య చేస్తాడు.

అతను సీరియల్ కిల్లర్ అనడానికి ఒకే ప్యాట్రన్ లో హత్యలు చేస్తూ ఉంటాడు. అయితే అమ్మాయిలపై అఘాయిత్యం చేయడు. వారిని టచ్ కూడా చేయడు. కానీ, వారి కాళ్లను మాత్రమే కలెక్ట్ చేస్తుంటాడు. అలా ఎందుకు చేస్తాడు అనే విషయం ఎవరికీ తెలియదు. వాళ్ల బాడీలను మాత్రం సిటీకి దూరంగా ఎక్కడో ఒకచోట డంప్ చేస్తూ ఉంటాడు. ఈ కేసును ఛేదించడం అంత తేలిక కాదు. పోలీసులకు కూడా పెద్ద సవాలుగా మారుతుంది. ఎక్కడా ఒక్క క్లూ కూడా లేకుండా వరుస హత్యలు చేస్తూ పోలీసులను పరిగెత్తిస్తాడు. అలాగే సిటీని వణికించేస్తాడు. ఒంటరిగా ఎవరైనా బయట తిరగాలి అంటే వణికిపోయే పరిస్థితికి తీసుకెళ్తాడు.

ఈ సినిమాలో క్రిమినల్ తెలివితేటలు, తెగువకు ఆడియన్స్ ఫ్యాన్స్ గా మారిపోతారు. ఎందుకంటే ఒక్కడే మొత్తం సీబీఐ డిపార్ట్ మెంట్ ని పరిగెత్తిస్తూ ఉంటాడు. ఈ సినిమా పేరు ‘ఫుట్ ఫెయిరీ’. ఇది నెట్ ఫ్లిక్స్, జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ ల్యాంగ్వేజ్, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. ఇందులో సీన్స్ కి మీరు కచ్చితంగా వావ్ అనే అంటారు. ఇప్పటివరకు చూడకపోతే మాత్రం.. ఒకసారి తప్పకుండా చూసేయండి. మరి.. ఇప్పటికే ఈ ఫుట్ ఫెయిరీ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments