YS Jagan Pulivendula Tour On March 11th 2024: పులివెందులలో జగన్‌ పర్యటన.. YSR ఆస్పత్రి ప్రారంభం

CM Jagan: పులివెందులలో జగన్‌ పర్యటన.. YSR ఆస్పత్రి ప్రారంభం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్‌ ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ ప్రారంభించారు. ఆ వివరాలు..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్‌ ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ ప్రారంభించారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండంతో.. రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఇక ఆదివారం నాడు బాపట్ల, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభ.. పొలిటికల్‌ హీటును మరి కాస్త పెంచింది. భారీ ఎత్తున జనాలు ఈ బహిరంగ సభకు తరలి వచ్చారు. ఇక సోషల్‌ మీడియాలో కూడా సిద్ధం సభ ట్రెండింగ్‌లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. వరుస పర్యటనలు, సభలతో ఫుల్లు బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. దీనిలో భాగంగా సోమవారం నాడు ఆయన తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. వైఎస్సార్‌ ఆస్పత్రి ప్రాంరభించడమే కాక.. అనేక అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెట్టారు.

పులివెందుల పర్యనటలో భాగంగా.. డాక్టర్‌ వైఎస్సార్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌, కాలేజీలను ప్రారంభించారు సీఎం జగన్‌. ఆ తర్వాత ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. మెడికల్‌ సిబ్బందిని అడిగి పలు వివరాలు తెలసుకున్నారు. అలానే స్థానిక సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను నోట్‌ చేసుకున్నారు. ఈ మెడికల్‌ కాలేజ్‌ 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అవుతుంది. సుమారు 51 ఎకరాల్లో.. 500 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు.

జీ ప్లస్ త్రీ భవనంలో ఓపిడి సేవలకు అందుబాటులో ఉండేలాగా నిర్మించారు. అలానే జీ ప్లస్ సిక్స్ భవనాన్ని ఐపీడీ సేవలకు కేటాయించారు. వాటితో పాటు బేస్మెంటు, జీ ప్లస్ త్రీ భవనంలో 24 గంటల పాటు అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలాగా రూపొందించారు. వైద్యవిద్య చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల కోసం వేరువేరు వసతి గృహాలను.. నర్సింగ్ కాలేజీ కోసం మరొక భవనాన్ని కూడా నిర్మించారు.

అంతేగాక పులివెందులలో ఎప్పటినుంచో ఏర్పాటు చేయాలనుకుంటున్న బనానా ప్యాక్ హౌస్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‎లను కూడా సీఎం జగన్‌ ప్రారంభించారు . మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం పులివెందులలో 20 కోట్లతో నిర్మించిన వైఎస్ జగన్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‎ను, అలాగే రూ.65 కోట్లతో ఏర్పాటు చేసిన డాక్టర్ వైయస్సార్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్‎ను ప్రారంభించారు. అనంతరం రూ.175 కోట్లతో ఆదిత్య బిర్లా వాళ్లు ఏర్పాటుచేసిన రెండు ప్రొడక్షన్ బ్లాక్‎లను కూడా స్టార్ట్‌ చేశారు. ఆ తర్వాత సీఎం జగన్‌ ఇడుపులపాయ చేరుకొని అక్కడ రూ.40 కోట్లతో అభివృద్ధి చేసిన డాక్టర్ వైయస్సార్ మెమోరియల్ పార్కును ప్రారంభించి అనంతరం కడప చేరుకొని అక్కడి నుంచి తాడేపల్లి బయలుదేరి వెళ్తారు.

Show comments