Akshay Kumar Reacts To Shikhar Dhawan Post: శిఖర్ ధవన్​కు అండగా నిలిచిన స్టార్ హీరో.. ఆ బాధ తనకు తెలుసంటూ..!

Shikhar Dhawan: శిఖర్ ధవన్​కు అండగా నిలిచిన స్టార్ హీరో.. ఆ బాధ తనకు తెలుసంటూ..!

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్​కు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సపోర్ట్​గా నిలిచాడు. అతడి బాధ తనకు తెలుసునని చెప్పాడు. అసలు ధవన్​ ఏ విషయంలో బాధపడుతున్నాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్​కు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సపోర్ట్​గా నిలిచాడు. అతడి బాధ తనకు తెలుసునని చెప్పాడు. అసలు ధవన్​ ఏ విషయంలో బాధపడుతున్నాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. తన బ్యాటింగ్​తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాడీ లెఫ్టాండ్ బ్యాటర్. ఓపెనర్​గా వచ్చి ఎన్నో మ్యాచుల్లో భారత్​కు ఒంటిచేత్తో విజయాలను అందించాడు. అయితే శుబ్​మన్ గిల్, ఇషాన్ కిషన్ లాంటి యువ ఆటగాళ్లు దూసుకురావడంతో టీమ్​లో చోటు కోల్పోయాడు ధవన్. డొమెస్టిక్ క్రికెట్​లో ఆడుతూ మళ్లీ జాతీయ జట్టులోకి కమ్​బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాంటి ధవన్ ఇటు కెరీర్​తో పాటు అటు తన పర్సనల్ లైఫ్​లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోయిన ఈ స్టార్ బ్యాటర్ చాన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. రీసెంట్​గా ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ధవన్, అయేషాకు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

విడాకులు మంజూరు అయినప్పటి నుంచి తన కొడుకు జొరావర్​ను కలుసుకోలేకపోతున్నాడు ధవన్. ఈ నేపథ్యంలో కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా టీమిండియా ఓపెనర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. జొరావర్​కు బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్​స్టాగ్రామ్​లో భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టాడు. దీనిపై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రియార్డ్ అయ్యాడు. ధవన్​కు అండగా నిలిచాడు అక్షయ్. శిఖర్ పోస్ట్ తనను కదిలించిందన్నాడు. ఒక తండ్రిగా పిల్లల్ని కలుసుకోకుండా దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్నాడు. కోట్లాది మంది అభిమానులతో పాటు తాను కూడా ధవన్ అతడి కొడుకును కలుసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పాడు అక్షయ్. అందుకోసం ప్రార్థిస్తున్నానని, దేవుడి ఆశీస్సులు ధవన్​కు ఉంటాయని తెలిపాడు.

కాగా, తన కొడుకు జొరావర్ బర్త్ డే సందర్భంగా ధవన్ ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తల్లి ఆయేషాతో కలసి ఉన్నాడు జొరావర్. అతడ్ని తలచుకొని ధవన్ ఎమోషనల్ అయ్యాడు. ‘నిన్ను (జొరావర్) చూసి ఏడాది అవుతోంది. మూడ్నెళ్లుగా అన్ని చోట్లా (సోషల్ మీడియాలో) నన్ను బ్లాక్ చేశారు. నీ నుంచి నన్ను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నీతో వీడియో కాల్​లో మాట్లాడి కూడా చాలా రోజులు అయింది. అందుకే నీకు బర్త్ డే విషెస్ చెప్పేందుకు పాత ఫొటోనే పోస్ట్ చేస్తున్నా. నీతో డైరెక్ట్​గా మాట్లాడలేకపోయినా.. టెలిపతీ ద్వారా నిన్ను కనెక్ట్ అవుతా. నిన్ను చూసి నేను గర్విస్తున్నా. ఈ నాన్న నిన్నెప్పుడూ మిస్సవుతాడు. లవ్ యూ జొరా’ అని ఇన్​స్టా పోస్ట్​లో రాసుకొచ్చాడు ధవన్. ఈ నేపథ్యంలో అతడికి సపోర్ట్​గా నిలిచాడు అక్షయ్. త్వరలో శిఖర్, జొరావర్ కలుసుకుంటారని తెలిపాడు. మరి.. ధవన్​కు అక్షయ్ కుమార్ మద్దతుగా నిలవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎవరికీ సాధ్యం కాని ఫీట్​ను సాధించిన స్టార్ బ్యాటర్!

Show comments