IPL 2024: విధ్వంసానికి మారుపేరు ఆ జట్టే.. SRH కానే కాదు..!: టీమిండియా మాజీ ప్లేయర్

IPL 2024: విధ్వంసానికి మారుపేరు ఆ జట్టే.. SRH కానే కాదు..!: టీమిండియా మాజీ ప్లేయర్

ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత విధ్వంసకరమైన టీమ్ సన్ రైజర్స్ కానే కాదని, అసలైన ఊచకోతకు నిర్వచనం వేరే టీమ్ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్. మరి ఆ టీమ్ ఏది? వివరాల్లోకి వెళితే..

ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత విధ్వంసకరమైన టీమ్ సన్ రైజర్స్ కానే కాదని, అసలైన ఊచకోతకు నిర్వచనం వేరే టీమ్ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్. మరి ఆ టీమ్ ఏది? వివరాల్లోకి వెళితే..

ఈ ఐపీఎల్ సీజన్ లో విధ్వంసానికి మారుపేరు ఏ జట్టు అంటే? చాలా మంది సన్ రైజర్స్ హైదరాబాద్ అనే చెబుతారు. అంతలా SRH టీమ్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే కాక.. టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు(287) చేసిన జట్టుగా సన్ రైజర్స్ టీమ్ నిలిచిన విషయం తెలిసిందే. దీంతో పాటుగా వరుసగా 277, 267 పరుగులు సాధించి.. ప్రపంచ క్రికెట్ నే ఔరా అనిపించింది. అలాంటి సన్ రైజర్స్ టీమ్ ను కాదని.. అసలైన విధ్వంసానికి మారుపేరు ఆ జట్టే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా. మరి ఈ టీమిండియా సీనియర్ చెప్పిన ఆ టీమ్ ఏది?

సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ ఐపీఎల్ సీజన్ లో వరుసగా రికార్డు స్కోర్లు సాధించి.. క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 287, 277, 267 పరుగులు చేసి రికార్డ్ స్కోర్లు నమోదు చేయాలంటే మా తర్వాతే అని మిగతా టీమ్స్ కు సవాల్ విసిరింది. ఇప్పటి వరకు ఏ టీమ్ కూడా SRH రికార్డ్ ను బ్రేక్ చేయలేదు. అయితే తాజాగా ముగిసిన లక్నో వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ తర్వాత టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా కేకేఆర్ టీమ్ ను ఆకాశానికి ఎత్తేశాడు.  విధ్వంసకర ఆటను కళ్లకు కట్టిందని, ఏకపక్ష విజయానికి సరైన నిర్వచనం ఇచ్చిందని ప్రశంసలు కురిపించాడు.

ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..”లక్నో సొంతగడ్డపైనే వారిని కేకేఆర్ మట్టికరిపించిన తీరు అద్భుతం. ఏకపక్ష విజయం అంటే ఎలా ఉంటుందో.. కేకేఆర్ ఈ మ్యాచ్ ద్వారా అందరికి తెలియజేసింది. లక్నోకు అతిపెద్ద పరాజయాన్ని రుచిచూపించింది. అసలు ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత విధ్వంసకరమైన టీమ్ సన్ రైజర్స్ అని ఎవరన్నారు? అసలైన విధ్వంసకర జట్టు కేకేఆర్. ఇప్పటికే ఆ టీమ్ ఆరుసార్లు 200కు పైగా స్కోర్లు సాధించిందని, కేకేఆర్ కంటే ప్రమాదకరమైన టీమ్ ఇంకేదీ లేదు” అంటూ ఆ జట్టును ఆకాశానికి ఎత్తేశాడు టీమిండియా మాజీ ప్లేయర్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. జట్టులో సునీల్ నరైన్(39 బంతుల్లో 81 రన్స్) మరోసారి సునామీ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. అనంతరం లక్నో 137 రన్స్ కే ఆలౌట్ అయ్యి.. 98 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి ఈ ఐపీఎల్ లో అత్యంత ప్రమాదకరమైన జట్టు ఏది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments