12 ఏళ్ళ తర్వాత రజని ఐష్ కాంబో

12 ఏళ్ళ తర్వాత రజని ఐష్ కాంబో

సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ మరోసారి జోడి కట్టబోతున్నారు. డాక్టర్ తో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకుని బీస్ట్ తో మొదటి ఫ్లాప్ టేస్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో ఈ ఇద్దరూ భార్యా భర్తలుగా నటించబోతున్నారు. రోబోలో యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ కోసం ఎందరు ట్రై చేసినా కుదరలేదు. తిరిగి ఇప్పటికి నెల్సన్ వల్ల సాధ్యపడుతోంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఏ జానర్ అనేది ఇంకా రివీల్ కాలేదు. నెల్సన్ స్పెషలిస్ట్ అయిన డార్క్ కామెడీ తీసుకుంటారా అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.

ఇందులో రమ్యకృష్ణ మరో కీలక పాత్ర చేస్తున్నారు. నరసింహలో విలన్ నీలాంబరిగా ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేశాక బాబాలో చిన్న సీన్ చేసిన శివగామి మళ్ళీ తలైవాతో కలిసి కనిపించలేదు. ఇందులో ఎలాంటి రోల్ ఇచ్చారో ఇంకా తెలియాల్సి ఉంది. ఇంతే కాదు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ సైతం ఒక క్యామియో చేస్తున్నారు. శాండల్ వుడ్ కాకుండా బయట ఆయన చేస్తున్న మొదటి సినిమా ఇదే. బాలకృష్ణ గౌతమిపుత్రశాతకర్ణిలో ఒక పాటలో మెరిశారు కానీ అది డైరెక్ట్ గా కథకు సంబంధం ఉన్నది కాదు. సో ఇన్ని ప్రత్యేకతలతో రజనీకాంత్ 169ని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనుంది.

పెద్దన్న రూపంలో గత ఏడాది భారీ డిజాస్టర్ అందుకున్న రజినికి నిఖార్సైన హిట్టు వచ్చి చాలా కాలమయ్యింది. విక్రమ్ తో కమల్ హాసన్ కం బ్యాక్ ఇచ్చినట్టు తలైవాకు అలాంటి సక్సెస్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. యంగ్ జెనరేషన్ డైరెక్టర్లు సీనియర్ హీరోలను డీల్ చేస్తున్న తీరు అద్భుత ఫలితాలను ఇస్తోంది. అందుకే నెల్సన్ తో రజని మూవీ చాలా స్పెషల్ గా ఉండొచ్చు. ఇక 48 ఏళ్ళ వయసులోనూ అందం విషయంలో ఇప్పటి హీరోయిన్లతో పోటీ పడే ఐశ్వర్య రాయ్ ని ఇంత గ్యాప్ తర్వాత తెరమీద చూసుకోవడం కంటే ఫ్యాన్స్ కి బెస్ట్ మూమెంట్ ఏముంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది

Show comments