Priyamani Bought a Luxury Car: ఖరీదైన కారు కొన్న ప్రియమణి- ధర ఎంతో తెలుసా?

ఖరీదైన కారు కొన్న ప్రియమణి- ధర ఎంతో తెలుసా?

Priyamani Bought a Luxury Car: ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనలు, దర్శక నిర్మాతలు ఖరీదైన లగ్జరీ కార్లు కొనుగోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ లీస్ట్ లో ప్రియమణి చేరింది.

Priyamani Bought a Luxury Car: ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనలు, దర్శక నిర్మాతలు ఖరీదైన లగ్జరీ కార్లు కొనుగోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ లీస్ట్ లో ప్రియమణి చేరింది.

తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పటి వరకు మాలీవుడ్ కి చెందిన ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ సాధించారు. అలాంటి వారిలో ప్రియమణి ఒకరు. 2003 లో ‘ఎవరే అతగాడు?’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. కానీ ఈ మూవీ పెద్దగా సక్సెస్ సాధించలేదు. జగపతి బాబు హీరోగా నటించిన ‘పెళ్లైన కొత్తలో’ మంచి సక్సెస్ సాధించడమే కాదు..ప్రియమణికి వరుస ఆఫర్లు తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటి వరకు ఎంతో సంప్రదాయ లుక్ తో కనిపించిన ప్రియమణి.. నితిన్ నటించిన ‘ద్రోణ’ మూవీలో బికినీ తో రెచ్చిపోయింది. ఇంకేముంది.. అప్పటి నుంచి ప్రియమణికి తెలుగు, తమిళ, కన్న, మలయాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. తాజాగా ప్రియమణి ఓ లగ్జరీ కారు కొనుగోలు చేసింది. వివరాల్లోకి వెళితే..

తెలుగుతో పాటు పలు భాషల్లో నటిస్తు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది ప్రియమణి. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది. మాలీవుడ్ కి చెందిన ప్రియమణి అతి తక్కువ కాలంలో వివిధ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ మద్య సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన ప్రియమణి బుల్లితెరపై పలు రియాల్టీ షోల్లో జడ్జీగా వ్యవహరించారు. ఓ వైపు వెండితెర, బుల్లితెరపై రాణిస్తూనే వెబ్ సీరీస్‌ల వైపు దృష్టి పెట్టింది. ఇటీవల జవాన్ చిత్రంలో ప్రియమణి నటనకు మంచి మార్కులు పడ్డారు. దీంతో ఈమెకు వరుసగా బాలీవుడ్ లోనూ ఛాన్సులు వస్తున్నాయి. తాజాగా ప్రియమణి తనకు ఎంతో ఇష్టమైన మెర్సిడేస్ బేజ్ కంపెనీకి చెందిన ‘జీఎల్‌సీ’కొనుగోలు చేసింది.

దేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సి ఎస్‌యూవీని చాలా మంది సెలబ్రెటీలు, ప్రముఖులు కొనుగోలు చేశారు. వీరి ఖాతాలోకి నటి ప్రియమణి చేరింది. ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు కొనుగోలు చేసింది. మార్కెట్ లో జీఎల్‌సీ ప్రారంభ ధర రూ.74.20 లక్షల నుంచి ప్రారంభం. అయితే ఈ కారు పెట్రోల్ వేరియెంటా? డిజిల్ వేరియంటా? అన్నది తెలియదు. ఈ కారు అద్భుతమైన డిజైన్, అధునిక ఫీచర్స్ తో చూడగానే ఆకర్షించేలా ఉంటుంది. జీఎల్​సీలో 11.9 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 12.3 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​, 64 కలర్​ యాంబియెంట్​ లైటింగ్​, 360 డిగ్రీ కెమెరా, ఎయిర్​ ప్యూరిఫయర్​, పానారోమిక్​ సన్​రూఫ్​ వంటివి ఉన్నాయి. గ్రిల్, రీ డైజన్ చేయబడిన ఎల్‌ఈడీ హెడ్ లైట్ వంటి వాటితో పాటు బ్యాక్ సైడ్ రెండు చివరలను కలుపుతూ సన్నగా ఉండే ఎల్‌ఈడీ టేయిల్ టైల్ బార్, లైట్ చూడటానికి చాలా బాగుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Show comments