కొడుకుపై ప్రేమతో ఈ తండ్రి చేసిన సాహసం.. ఇది కదా ప్రేమంటే

కొడుకుపై ప్రేమతో ఈ తండ్రి చేసిన సాహసం.. ఇది కదా ప్రేమంటే

తల్లిదండ్రుల ప్రేమ అంత త్వరగా ఎవరికీ అర్ధం కాదు.. తాజాగా ఒక తండ్రి తన కన్న కొడుకు కోసం పడిన తపన గురించి తెలుసుకుంటే అందరు ఆశ్చర్య పోవాల్సిందే.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తల్లిదండ్రుల ప్రేమ అంత త్వరగా ఎవరికీ అర్ధం కాదు.. తాజాగా ఒక తండ్రి తన కన్న కొడుకు కోసం పడిన తపన గురించి తెలుసుకుంటే అందరు ఆశ్చర్య పోవాల్సిందే.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తల్లి దండ్రులకు.. కన్న బిడ్డలకు ఉన్న సంబంధం ముందు ఏ బంధం కూడా సాటిరాదు. కన్న తల్లిని కడ తేర్చిన కసాయి కొడుకు.. కన్న బిడ్డలను చెత్త కుప్పలో పడవేసిన కన్న తల్లి అని.. ఇలా రోజు రకరకాల వార్తలు వింటూ వస్తున్నాం. దీనితో అన్ని బంధాల మీద ఆశలు వదిలేసుకుంటున్నారు ఇప్పుడున్న జనరేషన్ వారు. కానీ, అందరు అలా ఉండరని.. ప్రపంచంలో ఇంకా ఎక్కడో ఒక దగ్గర స్వచ్ఛమైన ప్రేమ అలానే మిగిలి ఉందని.. కొన్ని సంఘటనలు నిరూపిస్తూ ఉంటాయి. అలాంటి కొన్ని సంఘటనలను కూడా ఇప్పటివరకు అడపా దడపా చూస్తూనే వస్తున్నాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన కూడా ఇటువంటిదే. కన్న తల్లి దండ్రులు.. బిడ్డలకు ఏ సమస్య వచ్చినా కానీ, కడ వరకు విడిచి పెట్టరని.. ఈ సంఘటన నిరూపించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సాధారణంగా అందరు తల్లి కొడుకుల ప్రేమ గురించి వర్ణిస్తూ ఉంటారు. కానీ, తండ్రి కొడుకుల ప్రేమ గురించి మాత్రం అంత ఎక్కువగా మాట్లాడారు. ఎందుకంటే తండ్రి తన ప్రేమను అంత త్వరగా.. బయటకు చూపించలేడు. అలాగే కన్న కొడుకు కూడా తండ్రి మీద ఎంత ప్రేమ ఉన్నా సరే.. అంత త్వరగా బయటపెట్టలేడు. అలానే కర్ణాటకలో.. ఒక తండ్రి కన్న కొడుకు కోసం పడే తపన చూస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లాల్సిందే. తన కన్న కొడుకు అనారోగ్యంతో ఉన్నాడని.. కొడుకు త్వరగా కోలుకోవాలని.. ఐదు పదుల పైగా వయసు మళ్లిన ఆ కన్న తండ్రి.. అవన్నీ లెక్క చేయకుండా.. చాముండేశ్వరి ఆలయ మెట్లపై మండుటెండలో పొర్లుదండాలు పెట్టాడు. దీనితో ఆ ఘటనను చూసిన వారందరి మనస్సు చలించిపోయింది. తండ్రి కొడుకుల మధ్య ఉన్న రక్త సంబంధం నిరూపించుకోడానికి.. ఇంతకంటే గొప్పగా మరే ఉదారహరణ ఉండదన్నట్లుగా.. ఆ తండ్రి నిరూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పుడు ప్రస్తుతం బయట పరిస్థితులు ఎలా ఉంటున్నాయనేది చూస్తూనే ఉంటున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు.. ఎన్నో వార్తలు అందరిని భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉంటున్నాయి. కన్నబిడ్డలు భారం అనుకుని వదిలేసే తల్లి దండ్రులు, వయస్సు మీద పడిన తర్వాత వారి అవసరాలు తీర్చుకుని.. తల్లి దండ్రులను బయటకు తరిమేసే కన్న బిడ్డలు.. ఇలా రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కన్న బిడ్డ బ్రతకడం కోసం కర్ణాటకలో ఆ తండ్రి పడే తపనను గురించి చూసిన నెటిజన్లు.. ఇంకా ఎక్కడో ఒక దగ్గర బ్రతకడానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి కొని ఆశలు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments