ఇలాంటి యాక్సిడెంట్ లైఫ్ లో చూసుండరు! డ్రైవర్ ఏకంగా సముద్రంలోకి!

ఇలాంటి యాక్సిడెంట్ లైఫ్ లో చూసుండరు! డ్రైవర్ ఏకంగా సముద్రంలోకి!

చాలా సినిమాలలో కార్లు గాలిలోకి పల్టీ కొట్టడం, అందులోనుంచి జనాలు ఎగిరి బయటపడడం ఇలాంటి యాక్షన్ సీన్స్ చూస్తూనే ఉన్నాము. అయితే, ఇలాంటి ఓ ఇన్సిడెంట్ రియల్ లైఫ్ లో కూడా జరిగిందంటే నమ్మగలమా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట షికార్లు చేస్తోంది.

చాలా సినిమాలలో కార్లు గాలిలోకి పల్టీ కొట్టడం, అందులోనుంచి జనాలు ఎగిరి బయటపడడం ఇలాంటి యాక్షన్ సీన్స్ చూస్తూనే ఉన్నాము. అయితే, ఇలాంటి ఓ ఇన్సిడెంట్ రియల్ లైఫ్ లో కూడా జరిగిందంటే నమ్మగలమా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట షికార్లు చేస్తోంది.

సినిమాలలో కనిపించే యాక్షన్ సీన్స్ అంటే అందరు ఇష్టపడుతూనే ఉంటారు. హీరో విలన్స్ ఫైటింగ్స్, కార్లు గాలిలో పల్టీ కొట్టడం, బైక్ రేసింగ్ ఇలా .. ప్రతి సీన్ అందరికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. అయితే, సినిమాలలో అంటే అక్కడ డూప్స్ ఉంటాయి.. రకరకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి.. వారికీ ఏ హాని జరగకుండా చూసుకుంటారు. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. కొంతమంది ఫేమస్ అవ్వడం కోసం .. ఇలాంటి సాహసాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఇలాంటి వీడియోస్ ను ఎన్నో చూశాము. అయితే ఇప్పుడు ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినిమాలలో చూపించినట్లే ఒక కార్ గాలిలో.. అనేక సార్లు పల్టీలు కొట్టి సముద్రంలో పడిపోయింది. ఇది కావాలని చేసిందా .. ప్రమాదవ శాత్తు జరిగిందా.. అనే విషయాలను చూసేద్దాం.

నెట్టింట షికార్లు చేస్తున్న ఈ వీడియోను గమనిస్తే, బీచ్ ఒడ్డున ఒక అతను ఒక కారును నడుపుకుంటూ వస్తున్నాడు. బీచ్ లో అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో.. డ్రైవర్ ఆ కారును బ్యాలెన్స్ చేయలేకపోయాడు. అప్పటికే అటు ఇటుగా ఉగిసలాడుతున్న ఆ కారు.. ఇక డ్రైవర్ కూడా బ్యాలెన్స్ చేయలేకపోవడంతో.. ఒక్కసారిగా అదుపుతప్పి.. గాల్లోకి ఎగిరింది. పైగా ఆ కారు గాలిలో మూడు నాలుగు పల్టీలు కొట్టి.. సముద్రంలో పడిపోయింది. అందులో ఉన్న డ్రైవర్ కూడా కార్ తో పాటే గాల్లో నుంచి ఎగిరిపడి నీటిలో పడిపోయాడు. వీడియోను బట్టి చూస్తే ఇది ప్రమాదవ శాత్తు జరిగినట్టుగా అనిపిస్తోంది. ఈ ఘటన కువైట్ లోని .. అబు అల్ హాసానియా బీచ్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక సామజిక మాధ్యమాలలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ డ్రైవర్ అదృష్టం బావుంది కాబట్టి బ్రతికి బయటపడ్డాడు అంటూ వాపోతున్నారు. పైగా ఆ డ్రైవర్ కు 34 సంవత్సరాల వయస్సు అని కూడా చెబుతూ ఉన్నారు. ఏదేమైనా ఈ రేంజ్ సీన్స్ ను సినిమాలలో చూస్తూ ఉంటే చాలా ఎక్సయిటింగ్ అనిపిస్తుంది. కానీ, రియాలిటీలో మాత్రం ఆశ్చర్యపోవాల్సింది. ఆ కార్ గాలిలో అన్ని సార్లు పల్టీలు కొట్టినా కూడా.. డ్రైవర్ ప్రాణాలతో బయటపడడం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో లైక్స్, కామెంట్స్ , షేర్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments