Benguluru: కోట్ల సంపదను విడిచి.. 11 ఏళ్ళ కొడుకుతో సన్యాసం చేపట్టిన తల్లీ..

Benguluru: కోట్ల సంపదను విడిచి.. 11 ఏళ్ళ కొడుకుతో సన్యాసం చేపట్టిన తల్లీ..

ఒకప్పుడు ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటని తెలియజెప్పడానికి ఎంతో మంది వేద పండితులు, గురువులు ఉండేవారు. కానీ, కాలం మారుతున్న కొద్దీ అన్ని అంతరించి పోయాయి. మళ్ళీ ఇప్పుడు అందరూ ఈ మార్గాన్ని అనుసరించడం మొదలు పెట్టారు.

ఒకప్పుడు ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటని తెలియజెప్పడానికి ఎంతో మంది వేద పండితులు, గురువులు ఉండేవారు. కానీ, కాలం మారుతున్న కొద్దీ అన్ని అంతరించి పోయాయి. మళ్ళీ ఇప్పుడు అందరూ ఈ మార్గాన్ని అనుసరించడం మొదలు పెట్టారు.

ఇటీవల ఓ జంట తమ యావదాస్తిని దానం చేసి సన్యాసం తీసుకున్న వార్తను చూశాము. ఒకప్పుడు ఆధ్యాత్మిక మార్గం గురించి చాటి చెప్పడానికి ఎంతో మంది గురువులు, వేద పండితులు ఉండేవారు. ప్రతి ఒక్కరు కూడా తమ దైనందిన జీవితాలలో ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేవారు. ఆ తర్వాత కాలం మారుతున్న కొద్దీ.. అన్ని అంతరించిపోయాయి. అలాగే కొంత మంది దొంగ బాబాల వలన వీటిపై పూర్తిగా నమ్మకం కోల్పోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడిప్పుడు వస్తున్న మార్పులను చూస్తుంటే.. మళ్ళీ మునుపటి కాలం తిరిగి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు మళ్ళీ అందరూ ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేందుకు… సన్యాసం స్వీకరిస్తున్నారు. తాజాగా ఓ తల్లీ కొడుకు కలిసి సన్యాస దీక్షను తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ముఖ్యంగా ఈ సన్యాస దీక్షలనేవి జైన మతంలో కనిపిస్తూ ఉంటాయి. తమ యావదాస్తిని, రక్త సంబంధీకులను వదిలి ఆధ్యాత్మిక మార్గంలో పయనించడమే వారి జీవిత లక్ష్యమని భావిస్తూ ఉంటారు. తమ జీవితాన్ని ఆధ్యాత్మికంగా క్రమశిక్షణతో.. గడపాలని చాలా మంది సన్యాస దీక్షను తీసుకుంటూ ఉంటారు. తాజాగా బెంగుళూరు కు చెందన ఓ ప్రముఖ వ్యాపారవేత్త భార్య.. తన 11 ఏళ్ళ కుమారుడితో కలిసి ఈ సన్యాస దీక్షను తీసుకున్నారు. ఆమె తన బిడ్డ కడుపులో ఉన్నప్పుడే.. సన్యాసినిగా మారాలని నిర్ణయం తీసుకున్నారట. దీనితో ఈ ఏడాది.. వారిద్దరూ జైన గురువుల దగ్గర ఈ సన్యాస దీక్షను తీసుకున్నారు. కొన్ని తరాల పాటు కూర్చుని తిన్న తరగని సంపద వారికి ఉన్నా కూడా ఆమెకు అవేమి సంతృప్తిని ఇవ్వలేదు. ఈ ప్రాపంచిక బంధాలను దాటి, ఆదేత్మిక మార్గంలో పయనించాలని ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె పేరు స్వీటీ(30), ఆమె కుమారుడు పేరు హృధన్‌ జైన్‌(11). దీక్ష తర్వాత జైన్ గురువులు వారిద్దరికీ భావశుద్ధి రేఖాశ్రీ, హితాశయ్‌ రతన్‌ విజయ్‌ అని పేర్లు మార్చారు. ఇకపై వారి జీవితం కేవలం సమాజ సేవకు మాత్రమే అంకితం.

అయితే, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రేఖాశ్రీ గర్భవతిగా ఉన్న సమయంలోనే.. పుట్టబోయే బిడ్డతో సహా సన్యాసం తీసుకుంటానానే నిర్ణయం తీసుకున్నారట. దీనితో ఆమె కొడుకు తన తల్లి ఆలోచనలను అర్ధం చేసుకున్నాడు. ఇక తన కొడుకు అంగీకారంతోనే ఇద్దరు కలిసి ఈ ఏడాది సన్యాస దీక్షను చెప్పట్టారు. ఇక జనుల్లో ఇలా ఎవరైనా సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని ఎంతో ఉన్నతంగా భావిస్తారు. అలా చేయడానికి వారంతా కూడా జైన దేవతల బోధనలను అనుసరించాల్సి ఉంటుంది. ముందు ముందు ఇంకెంత మంది ఇలా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తారో తెలియదు కానీ.. ఒకవేళ జరిగితే మాత్రం, సమాజంలో ఎన్నో మంచి మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పి తీరాల్సిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments