Jilebi Movie OTT: అందమైన అమ్మాయి.. అబ్బాయిల హాస్టల్ లోకి.. OTTలో అదిరిపోయే మూవీ!

Jilebi Movie OTT: అందమైన అమ్మాయి.. అబ్బాయిల హాస్టల్ లోకి.. OTTలో అదిరిపోయే మూవీ!

OTT New Release: ఇప్పుడు ఓటీటీ లలోకి వచ్చిన సినిమాలను చూసేస్తే కనుక రెఫ్రెషింగ్ కథలతో కొన్ని కొత్త సినిమాలు ఓటీటీ లోకి రాడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది.

OTT New Release: ఇప్పుడు ఓటీటీ లలోకి వచ్చిన సినిమాలను చూసేస్తే కనుక రెఫ్రెషింగ్ కథలతో కొన్ని కొత్త సినిమాలు ఓటీటీ లోకి రాడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది.

ఇప్పుడు సినిమాలంటే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏ అందరికి గుర్తొస్తున్నాయి. అందులోను హాలీవుడ్ బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులోనూ మంచి మంచి కొత్త సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. పైగా అవి కొత్త సినిమాలు కాకపోయినా సరే ఒక్కపుడు ఆయా సినిమాలకు దక్కని ఆదరణ ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని దక్కుతుంది. దీనితో మేకర్స్ కూడా దైర్యంగా పాత కంటెంట్ ను కాస్త కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇక ఇప్పుడు ఓటీటీ లలోకి వచ్చిన సినిమాలను చూసేస్తే కనుక రెఫ్రెషింగ్ కథలతో కొన్ని కొత్త సినిమాలు ఓటీటీ లోకి రాడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

శివాని రాజశేఖర్.. ప్రస్తుతం ఈ పేరుకు పెద్దగా పరిచయం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు చేసే కథలన్నీ కూడా చాలా రెఫ్రెషింగ్ అనిపిస్తూ ఉంటున్నాయి. ఈ మధ్యనే విద్యావాసుల అహం మూవీ ప్రేక్షకులను ఎంత మెప్పించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా శివాని లీడ్ రోల్ లో నటించిన సినిమానే.. ఈ సినిమా పేరు “జిలేబి”. వినడానికి స్వీట్ పేరులా ఎలా ఉందో.. ట్రైలర్ కూడా అంతే స్వీట్ గా.. రెఫ్రెషింగ్ గా ఉంది. ఈ సినిమాలో శివానితో పాటు.. శ్రీ కమల్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, బొడ్డుపల్లి శ్రీను, సాయి కుమార్ బబ్లూ, అంకిత్ కొయ్య, వివా సన్నీ, చమ్మక్ చంద్ర లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా త్వరలోనే ఆహలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది ఆహా ప్లాట్ ఫార్మ్. ఇక స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక జిలేబి సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో కమల్ అనే ఓ కుర్రోడికి.. భారతి అనే అమ్మాయితో.. పరిచయం అవుతుంది, క్రమంగా వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కుదురుతుంది. అయితే అదే వాళ్ళకి కొన్ని తిప్పలు తెచ్చిపెడుతుంది. భారతి ఓ రోజు అనుకోకుండా అబ్బాయిల హాస్టల్ లోకి వెళ్తుంది. ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే అది కుదరక అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది . దీనితో ఆమె కమల్ హెల్ప్ ని తీసుకుంటుంది. ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి ! ఆ హాస్టల్ వార్డెన్ కు భారతి దొరికిపోతుందా ! కమల్ భారతికి ఎలాంటి హెల్ప్ చేస్తాడు ! ఇవన్నీ తెలియాలంటే “జిలేబి” అనే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ కోసం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments