iDreamPost
android-app
ios-app

బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్.. రోజుకు 166 పొదుపుతో.. చేతికి మూడున్నర లక్షలు

పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అధిక లాభాలను ఇచ్చే పథకాలకోసం చూస్తున్నారా? అయితే ఆ పథకంలో రోజుకు 166 పొదుపు చేస్తే చాలు చేతికి మూడున్నర లక్షలు అందుకోవచ్చు. ఎలా అంటే?

పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అధిక లాభాలను ఇచ్చే పథకాలకోసం చూస్తున్నారా? అయితే ఆ పథకంలో రోజుకు 166 పొదుపు చేస్తే చాలు చేతికి మూడున్నర లక్షలు అందుకోవచ్చు. ఎలా అంటే?

బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్.. రోజుకు 166 పొదుపుతో.. చేతికి మూడున్నర లక్షలు

మొదట డబ్బును సంపాదించాలి. ఆ తర్వాత ఆ డబ్బులే డబ్బును సంపాదిస్తాయి. కావాల్సిందల్లా తెలివైన ఆలోచన. మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్టు చేస్తే అధిక లాభాలను అందుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అయితే స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడిపెడితే లాభాలు అందుకోవచ్చు. కానీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదే ప్రభుత్వ రంగానికి చెందిన పథకాల్లో పెట్టుబడి పెడితే సురక్షితమైన రాబడులు అందుకోవచ్చు. మరి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అద్బుతమైన పథకం అందుబాటులో ఉంది. రోజుకు 166 పొదుపుతో చేతికి మూడున్నర లక్షలు అందుకోవచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?

పోస్టాఫీస్ అనేక రకాల పథకాలను అందిస్తున్నది. మహిళలకు, బాలికలకు, సీనియర్ సిటిజన్స్ కోసం మంచి లాభాలను అందించే స్కీమ్స్ ను అందుబాటులో ఉంచింది. వాటిల్లో ఒకటి రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ అనేది బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేస్తున్న ఇండియన్ పోస్టాఫీస్ అందిస్తోంది. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసు ఆర్డీ పథకానికి 6.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టే వీలుంది.

166 పొదుపుతో.. చేతికి మూడున్నర లక్షలు:

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఐదు సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టారనుకుంటే.. రోజుకు 166 పొదుపు చేస్తే నెలకు 5000 అవుతుంది. అంటే ప్రతి నెల రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 60,000 అవుతుంది. ఐదు సంవత్సరాల్లో రూ. 3,00,000 పెట్టుబడి పెడతారు. మీరు పెట్టిన ఈ మొత్తం పెట్టుబడిపై ఐదు సంవత్సరాల తర్వాత 6.7 శాతం వడ్డీతో రూ.56,830 పొందుతారు. అంటే ఫైనల్ గా మీ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీపై మొత్తం రూ. 3,56,830 రాబడిని అందుకుంటారు. ప్రభుత్వ పథకం కాబట్టి మీరు పెట్టిన పెట్టుబడి సురక్షితంగా చేతికి అందుతుంది. మంచి లాభాలను అందుకోవాలంటే ఈ స్కీమ్ బెస్ట్ అంటున్నారు నిపుణులు.